Allu Arjun : అల్లు అర్జున్ నెక్ట్స్.. ఊహించని ట్విస్ట్

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో ఇండియా నుంచి మరో సూపర్ హీరోగా కనిపించబోతున్నాడు. అట్లీ డైరెక్షన్ లో రూపొందుతోన్న మూవీలో అతను శక్తి మాన్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ సరసన దీపికా పదుకోణ్ హీరోయిన్ గా నటించబోతోన్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. సౌత్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని ఇప్పటికే తెలుస్తోంది. ఈ మూవీతో ఐకన్ స్టార్ ఇండియాలోనే హయ్యొస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటోన్న హీరోగా మారాడు. హాలీవుడ్ టెక్నాలజీతో రూపొందబోతోన్నఈ సినిమాను ఈ యేడాది చివరలో స్టార్ట్ చేయబోతున్నారు. అప్పటి వరకూ విజువల్స్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా తర్వాత ఇండియన్ సినిమా రేంజ్ మారుతుందనే టాక్ ఉంది. అయితే అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
మళయాలంలో వరుస సినిమాలతో సూపర్ హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నాడు బసిల్ జోసెఫ్ అనే కుర్రాడు. హీరోగా చిన్న సినిమాలు పెద్ద విజయాలతో అదరగొడుతున్నాడు. ఓటిటి ద్వారా జయ జయ జయ జయ హే, నూనాకుళి, సూక్ష్మ దర్శిని, పొన్ మేన్ వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు కూడా ఫేవరెట్ అయ్యాడు. అయితే అతను నటుడు మాత్రమే కాదు.. మంచి దర్శకుడు కూడా. మళయాలం నుంచి ఫస్ట్ సూపర్ హీరో మూవీని డైరెక్ట్ చేసిన వాడు. టోవినో థామస్ ఆ సూపర్ హీరోగా నటించిన ఈ సినిమా పేరు మిన్నల్ మురళి. కోవిడ్ టైమ్ లో వచ్చిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. అద్భుతమైన అప్లాజ్ అందుకుంది. బసిల్ జోసెఫ్ లోని ఈ యాంగిల్ కు చాలామంది ఫిదా అయిపోయారు. అలాంటి బసిల్ జోసెఫ్ డైరెక్షన్ లోనే అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.
అల్లు అర్జున్ 23వ చిత్రంగా రూపొందే ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తుందంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతానికైతే రూమర్ గానే ఉన్నా.. ఇది నిజమే అంటున్నారు చాలామంది. మరి ఇది నిజమే అయితే అల్లు అర్జున్ మరోసారి సూపర్ మేన్ గా కనిపిస్తాడా లేక సూపర్ హీరోగా కనిపిస్తాడా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com