Allu Arjun: 'గని' కోసం 'బన్నీ' కొడుకు.. అచ్చం డాడీలానే.. వీడియో వైరల్

Allu Arjun: తగ్గేదేలే.. నాన్న స్టైలిష్ స్టార్ అయితే వారసుడు అంతకు మించి.. పులి కడుపున పులే పుడుతుంది కానీ పిల్లి ఎలా పుడుతుంది. నాన్న స్టైల్ చూస్తూ, నాన్న సినిమాలు చూస్తూ పెరుగుతున్నాడు.. ఆ మాత్రం లేకపోతే అల్లు అర్జున్ వారసుడు ఎలా అవుతాడు అయాన్. కూతురు అర్హ శాకుంతలం సినిమాలో చిన్నారి సమంతగా నటిస్తే.. కొడుకు అయాన్ 'గని' సినిమా కోసం సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇస్తున్నాడు.
నాన్నకే కాదు నాక్కూడా నటించడం బాగా వచ్చు అన్నట్లుంది అయాన్ ఫోజు చూస్తుంటే. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలోని ఫస్ట్ లిరికల్ సాంగ్‌లో అయాన్ చేసిన వర్కవుట్ వీడియోను గీతా ఆర్ట్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయాన్‌ను చూసి బన్నీ అభిమానులు ఖుషీ అవుతున్నారు. అచ్చం బన్నీ లాగే ఫుల్ ఎనర్జిటిక్‌తో స్టైల్గా ఉన్నాడని ప్రశంసిస్తున్నారు. క్యూట్‌గా ముద్దుగా ఉన్నాడని కామెంట్లు పెడుతున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను రెనైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు, ఉపేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com