Allu Arjun : అల్లు అర్జున్ స్ట్రాంగ్ లైనప్ చూశారా..

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ లైన్ అప్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. పుష్ప 2 అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఆలస్యం అవుతోంది. అయినా తర్వాత వచ్చే ప్రాజెక్ట్స్ విషయంలో పక్కా ప్లానింగ్ తో కనిపిస్తున్నాడు. సుకుమార్ తో విభేదాలు అనే మాటకు ఫుల్ స్టాప్ పెట్టి ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు ఐకన్ స్టార్. సెప్టెంబర్ మూడో వారం వరకూ అల్లు అర్జున్ పోర్షన్ కంప్లీట్ అవుతుందట. అఫ్ కోర్స్ మూవీ షూటింగ్ కూడా పూర్తవుతుందట. ఇప్పటి వరకూ అయిన పోర్షన్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయిందంటున్నారు. సో.. వీళ్లు అనుకుంటున్నట్టుగా డిసెంబర్ 6న సినిమా ఖచ్చితంగా విడుదలవుతుందనుకోవచ్చు.
సుకుమార్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్రాజెక్ట్ కన్ఫార్మ్ అయింది. ప్యాన్ ఇండియా కంటెంట్ తో రూపొందబోతోన్న ఈ మూవీ ఈ ఇద్దరి కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందబోతోందంటున్నారు. ప్రస్తుతం వినిపించేదాన్ని బట్టి ఇది మైథలాజికల్ టచ్ తో సాగుతుందంటున్నారు. కర్ణుడు, లేదా అర్జునుడి కోణంలో ఉండే అవకాశం ఉందనే టాక్ ఉంది. ఈ మూవీతో త్రివిక్రమ్ కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో తన సత్తా నిరూపించుకోబోతున్నాడు అనుకోవచ్చు. ఈ మూవీ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో రాబోతోన్న నాలుగో సినిమా కావడం విశేషం.
త్రివిక్రమ్ తర్వాత అట్లీతో సినిమా ఉండే అవకాశం ఉందట. ఆల్రెడీ అట్లీతో మూవీకి సంబంధించి గతంలోనే వార్తలు వచ్చాయి. కాకపోతే అతను చెప్పిన లైన్ అల్లు అర్జున్ కు నచ్చలేదు. అందుకే అప్పట్లో హోల్డ్ లో పెట్టాడు. బట్ అట్లీ ఎలాగైనా అల్లు అర్జున్ ను మెప్పించి అతనితో సినిమా చేయాలనుకుంటున్నాడు. సో.. త్రివిక్రమ్ తర్వాత అతని రేంజ్ మారే అవకాశం ఉంది. అందుకు తగ్గ కంటెంట్ తో వస్తే ఈ ప్రాజెక్ట్ ఓకే అవుతుంది.
అట్లీ మూవీ ఓకే కాకపోతే గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే మరోసారి బోయపాటి శ్రీనుతో సినిమా ఫిక్స్ అయి ఉంది. నిజానికి పుష్ప 2 తర్వాత బోయపాటితోనే చేయాలి. కానీ అతను బాలకృష్ణతో ప్రాజెక్ట్ కు కమిట్ అయ్యాడు. వీరి కాంబోలో అఖండ 2 రాబోతోంది. అందుకే బాలయ్య మూవీ తర్వాత అల్లు అర్జున్ తో మూవీ చేస్తాడు. సో.. పుష్ప 2 ఆలస్యం అయినా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు ఐకన్ స్టార్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com