Allu Sirish: మా అభిరుచులు కలిశాయి: అనూతో డేటింగ్‌పై శిరీష్ కామెంట్

Allu Sirish: మా అభిరుచులు కలిశాయి: అనూతో డేటింగ్‌పై శిరీష్ కామెంట్
Allu Sirish: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు నటుడు అల్లు శిరీష్‌ నటి అను ఇమ్మాయియేల్‌తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

Allu Sirish-Anu Immanuel: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు నటుడు అల్లు శిరీష్‌ నటి అను ఇమ్మాయియేల్‌తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి నటించిన ఊర్వశివో రాక్షసివో విడుదలకు సిద్ధంగా ఉంది. సిద్ధమవుతోంది. సినిమాలో వీరిద్దరూ కలిసి ఉండే ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నాయి. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని వినిపిస్తోంది. అయితే అను అలాంటి గాసిప్స్‌ని తిరస్కరించింది.


రాకేష్ శశి దర్శకత్వంలో శిరీష్, అను జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఊర్వశివో రాక్షసివో. సునీల్, వెన్నెల కిషోర్, కేదార్ శంకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది. సోషల్ మీడియాలో టీజర్ వైరల్ గా మారింది. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 4న థియేటర్లలోకి రానుంది.


మిష్కిన్ దర్శకత్వంలో విశాల్ నటించిన తుప్పరివాలన్ ద్వారా అను తమిళ చిత్ర సీమలోకి ప్రవేశించింది. కానీ ఆమెకు తమిళం కంటే తెలుగులోనే ఎక్కువగా గుర్తింపు వచ్చింది. అను నటించిన తొలి తెలుగు చిత్రం నానితో కలిసి నటించిన మజ్ను. తర్వాత చాలా సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. శివ కార్తికేయన్ నటించిన నమ్మా బేకు పిల్లే సినిమా ఆమెకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. అను తండ్రి తంగచన్ ఇమ్మాన్యుయేల్ మలయాళ చిత్ర నిర్మాత.

కాగా, అనుతో డేటింగ్ వార్తలపై స్పందించిన అల్లు శిరీష్ "నటీనటుల జీవితాల్లో ఇలాంటి వదంతులు సర్వసాధారణం. మా మధ్య అలాంటిది ఏం లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం. కొన్ని నెలలపాటు కలిసి పని చేశాం కాబట్టి మా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. మా ఇద్దరి వ్యక్తిత్వాలు ఒకేలా ఉంటాయి. దాని వల్ల మేమిద్దరం మాట్లాడుకోవడానికి ఎక్కువ అవకాశం ఏర్పడింది.



వర్క్ విషయంలో ఆమె చాలా ప్రొఫెషనల్‌గా ఉంటుంది. అందువల్ల రొమాంటిక్ సన్నివేశాలు చేసేటప్పుడు ఇబ్బంది పడలేదు. ఆన్‌లైన్‌లో కామెంట్లు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు పెడుతుంటారు. అందుకే రెండేళ్ల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాను అని చెప్పాడు శిరీష్.

Tags

Read MoreRead Less
Next Story