అల్లు స్నేహ విన్యాసాలు.. వైరల్ గా మారిన ఫోటోలు..!

అల్లు స్నేహ విన్యాసాలు.. వైరల్ గా మారిన ఫోటోలు..!
అల్లు అర్జున్ సతిమణి అల్లు స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటారు.

అల్లు అర్జున్ సతిమణి అల్లు స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటారు. బన్నీతో పాటు తన పిల్లలు అయాన్‌, అర్హలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. అయితే తాజాగా తనలోని ఓ కొత్త టాలెంట్ ని బయటపెట్టింది స్నేహ. గత కొద్ది రోజులుగా ఆమె యోగా నేర్చుకుంటున్నారు. అందులో భాగంగానే త‌ల‌కిందకు పెట్టి గాల్లో వేలాడుతూ చేసే యోగాస‌నంపై కొన్నాళ్లుగా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. స్నేహ విన్యాసనాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా అటు అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే సినిమాని చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story