Pushpa: దాక్కో దాక్కో మేక.. 'పుష్ప' ఫస్ట్ సాంగ్ సింగిల్

Pushpa First Single: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ 'పుష్ప'. హిందీ, తమిళ, తెలుగు, మళయాల, కన్నడ భాషల్లో ఈ పాటను ఆగస్ట్ 13న విడుదల చేయబోతన్నట్టు తెలిపారు. అటవీ బ్యాక్‌డ్రాప్‌లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. దేవిశ్రీ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు(ఆగస్ట్ 2) ఈ మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్‌ని ప్రటకించింది. 5 భాషల్లో రాబోతోన్న ఈ పాటకు సంబంధించిన అప్డేట్ ఇచ్చింది మూవీ యూనిట్.
పుష్ప ఫస్ట్ సింగిల్ అంటూ దాక్కో దాక్కో మేక.. అంటూ దేవీ శ్రీ ప్రసాద్ దుమ్ములేపేందుకు రెడీ అయ్యారు. హిందీలో ఈ పాటను విశాల్ దద్లానీ, తెలుగులో శివం, కన్నడంలో విజయ్ ప్రకాశ్, మళయాలంలో రాహుల్ నంబియార్, తమిళంలో బెన్నీ దయాల్ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సింగిల్ ట్యూన్ ఆగస్ట్ 13న విడుదల కానున్నట్టు తెలియజేశారు. దీంతో ఈరోజు ఉదయం నుంచి అల్లు అర్జున్ హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవుతూనే వచ్చాయి.
శ్రీ ప్రసాద్‌పై బన్నీ ట్వీటర్లలో పోస్ట్ వేశారు. హ్యాపీ బర్త్ డే మై డియర్ దేవీ.. పుష్ప కోసం నువ్వు కంపోజ్ చేసిన ఈ సంగీతం ప్రపంచమంతా చూడాలి.. సమయం కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను. మళ్లీ నీ సంగీతంతో ప్రేమలో పడిపోయాను. ఇలానే మ్యాజిక్ చేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి అని దేవీ అంటూ బన్నీ ట్వీట్ చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com