Puneeth Rajkumar: రాజ్‌కుమార్ ఫ్యామిలీకి కలిసిరాని జిమ్..

Puneeth Rajkumar (tv5news.in)
Puneeth Rajkumar: ఈరోజుల్లో ఉన్న ఆహార పదార్థాలను బట్టి దేని వల్ల ఏ నష్టం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే సరైన డైట్ మెయింటేయిన్ చేస్తూ ఫిట్‌గా ఉండడం మంచిదని భావిస్తూ ఉంటాం. కానీ నిన్న పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం తర్వాత ఎంత ఫిట్‌గా ఉన్నా కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవేమో అనిపిస్తోంది. పైగా రాజ్‌కుమార్ కుటుంబానికి జిమ్ అంతగా కలిసి రాలేదని ఇంతకు ముందు జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుచేసుకుంటుంటే అర్థమవుతోంది.
పునీత్ రాజ్‌కుమార్‌కు జిమ్ చేయడం, బాడీని ఫిట్‌గా ఉంచుకోవడం చాలా ఇష్టం. ఈకాలంలో చాలామంది ఇతర హీరోలలాగానే ఆయన కూడా ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. జిమ్‌కు వెళ్లని ఒక్కరోజు కూడా తన దష్టిలో పూర్తిగా వృథా అయినట్టే అని పునీత్ చాలా సందర్భాల్లో తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో బాడీ షేప్ అయిపోయిందని, సడలింపులు జరగగానే వెంటనే జిమ్‌కు వెళ్లి అతి కష్టమైన వ్యాయామాలు చేసి మళ్లీ ఫార్మ్‌లోకి వచ్చేశారు.
పునీత్.. ఎంతగానో ఇష్టపడే ఫిట్‌నెస్ సెంటర్‌లోనే కన్నుమూయడం అందరినీ కలచివేస్తోంది. ఇంతకు ముందు కూడా రాజ్‌కుమార్ కుటుంబానికి జిమ్‌లో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. పునీత్ అన్నయ్య రాఘవేంద్రకు జిమ్‌లోనే వ్యాయామం చేస్తుండగా పక్షవాతం వచ్చింది. ఆ తర్వాత చాలాకాలానికి ఇంకొక అన్నయ్య శివరాజ్‌కుమార్ కూడా జిమ్‌లోనే అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు పునీత్ కూడా జిమ్‌లోనే కన్నుమూశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com