Nagarjuna : నాగార్జునతో సినిమా.. చుక్కలు చూపిస్తున్న హీరోయిన్స్?

Nagarjuna : అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. 'ది ఘోస్ట్' అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్‌గా కాజల్‌ని ఎంపిక చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల కాజల్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీనితో మరో హీరోయిన్ కోసం వేటలో పడ్డారు మేకర్స్.. అందులో భాగంగానే హీరోయిన్ అమలా పాల్‌ను సంప్రదించగా ఆమె భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. దీనితో ఆమెను కాదని మెహరీన్ కౌర్‌ను అడగ్గా ఆమె ఏకంగా కోటిన్నర డిమాండ్ చేసిందని ఫిలింనగర్ లో టాక్ నడుస్తోంది. హీరోయిన్ల వైఖరితో నిర్మాతలు విసిగిపోయారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం నాగార్జున 'బంగార్రాజు' మూవీతో బిజీగా ఉన్నాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com