Sivakarthikeyan : అమరన్.. ఐదు భాషలు.. ఐదుగురు స్టార్స్

శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా అమరన్. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ నిర్మించిన సినిమా ఇది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకుడు. ఈ నెల 31న తమిళ్ తో పాటు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా సెమీ బయోపిక్ లాంటి కంటెంట్ తో ఈ చిత్రం రూపొందిందని చెబుతున్నారు. శివకార్తికేయన్ మేజర్ ముకుంద వరదరాజన్ అనే ఆర్మీ అధికారిగా నటించాడు. ఇక ఈ మూవీ ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ ఆయా భాషల స్టార్స్ తో విడుదల చేయించబోతుండటం విశేషం.
తమిళ్ లో అమరన్ ట్రైలర్ ను నిర్మాత కమల్ హాసన్ విడుదల చేస్తాడు. తెలుగులో నాని, కన్నడలో శివరాజ్ కుమార్, మళయాలంలో టోవినో థామస్ అమరన్ ట్రైలర్స్ ను రిలీజ్ చేస్తారు. ఇక హిందీలో ఆమిర్ ఖాన్ రిలీజ్ చేయబోతున్నాడు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ కూడా ఇచ్చారు. ఓ రకంగా ఇది మంచి ప్లాన్ అనే చెప్పాలి. శివకార్తికేయన్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగాడు. తనకంటూ తిరుగులేని స్టార్డమ్ తెచ్చుకున్నాడు. అలాంటి హీరోకు ఇంత మంది హీరోల మద్ధతు అంటే పెద్ద విషయమే కదా. అఫ్ కోర్స్ ఇదంతా కమల్ వల్లే సాధ్యమైంది.
ఇక తెలుగులో ఇప్పటి వరకూ ఈ చిత్రానికి పెద్దగా అంచనాలు లేవు. ట్రైలర్ వచ్చిన తర్వాత ఏమైనా పెరుగుతుందేమో కానీ.. దివాలీ మూవీస్ లో ఈ చిత్రం గురించి ఆడియన్స్ లో ఎలాంటి బజ్ లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com