Sivakarthikeyan : రికార్డ్ సెంచరీ కొట్టిన అమరన్..

Sivakarthikeyan :  రికార్డ్ సెంచరీ కొట్టిన అమరన్..
X

ఈ దీపావళి అన్ని భాషల సినిమాలకూ భలే కలసొచ్చింది. అన్ని సినిమాలూ మాగ్జిమం సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. చాలా వరకూ బ్రేక్ ఈవెన్ అయ్యాయి. ఒక్క కన్నడ బఘీర తప్ప మిగతావన్నీ ప్రాఫిట్ వెంచర్స్ లానే కనిపిస్తున్నాయి. ఇక తమిళ్ నుంచి భారీ అంచనాలతో వచ్చిన అమరన్ కు అక్కడ జనం బ్రహ్మరథం పట్టారు. తెలుగులోనూ డీసెంట్ ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయ్యి కంప్లీట్ పాజిటివ్ నోట్ లోనే దూసుకుపోతోన్న అమరన్ తన హోమ్ గ్రౌండ్ అయిన తమిళనాడులో భారీ వసూళ్లు సాధిస్తోంది. నాలుగు రోజుల్లోనే ఏకంగా 100 కోట్ల క్లబ్ లో ఎంటర్ అయ్యింది. ఈయేడాది వంద కోట్లు సాధించిన మహారాజా, అరణ్మనై 4 చిత్రాల లైఫ్ టైమ్ కలెక్షన్స్ ను ఈ మూవీ కేవలం నాలుగు రోజుల్లోనే సాధించేయడం విశేషం.

రాజ్ కుమార్ పెరియసామి డైరెక్ట్ చేసిన ఈ మూవీకి శివకార్తికేయన్, సాయి పల్లవి జోడీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా రూపొందినా అద్భుతమైన ఎమోషన్స్ తో దేశభక్తిని మరింత పెంపొందించేలా రాజ్ కుమార్ బాగా డైరెక్ట్ చేశాడు. కోలీవుడ్ లోని స్టార్స్ అంతా ఈ చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు.

అమరన్ నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా 73. 63 కోట్లు, ఓవర్శీస్ లో 35 కోట్ల గ్రాస్ సాధించింది. టోటల్ గా 109.63 కోట్లు అన్నమాట. ఈ ఫిగర్స్ మరింత పెరుగుతాయి. ఈ యేడాది తమిళ్ నుంచి విడుదలైన సినిమాల్లో వంద కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిన సినిమాగా కూడా నిలిచింది అమరన్.

Tags

Next Story