Amaran Trailer : అమరన్ ట్రైలర్.. ఒక్కమాటలో చెబితే ‘‘ఎక్స్ ల్లెంట్’’

తమిళ్ హీరోల్లో చాలామందికి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. కంటెంట్ బావుంటే మన ఆడియన్స్ ఎవరినైనా ఆదరిస్తారు కదా. అందుకే వారికి ఇమేజ్ పెరుగుతోంది ఇక్కడ. కొన్నాళ్లుగా తెలుగు మార్కెట్ పై బాగా ఫోకస్ పెట్టాడు శివకార్తికేయన్. అతను నటించిన అమరన్ అనే సినిమా ఈ 31న విడుదల కాబోతోంది. రాజ్ కుమార పెరియసామి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. లోక నాయకుడు కమల్ హాసన్ నిర్మాత. సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. తెలుగులోనూ అదే రోజు రిలీజ్ కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ ను నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదల చేశారు.
మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా రూపొదిన సినిమా అమరన్. ట్రైలర్ గురించి సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే ‘‘ఎక్స్ ల్లెంట్’’ అంతే. ఆ స్థాయిలో ఉంది. దేశభక్తి నిండిన సినిమాలు ఎప్పుడూ స్ఫూర్తిని నింపుతాయి. ఇక బయోపిక్ అంటే ఖచ్చితంగా ధైర్యం, త్యాగం రెండూ ఉంటాయి. ఆ రెంటికీ ఫ్యామిలీ ఎమోషన్స్ ను కూడా అద్భుతంగా మిక్స్ చేసి రూపొందించినట్టుగా కనిపిస్తోందీ ట్రైలర్. మేజర్ ముకుందన్ ను ఆర్మీలో మ్యాడీ అనేవారట. తను ఏదైనా చేయాలనుకుంటే ప్రాణం పోయినా వదలడు. అందుకే అతన్ని మ్యాడీ అనేవారు. అది తనకు దేశంపై ఉన్న పిచ్చి ప్రేమకు కూడా నిదర్శనంగా చెబుతారు. ఆ విషయాన్ని కూడా అద్భుతంగా పోట్రే చేశాడు దర్శకుడు రాజ్ కుమార్. ఆ పాత్రలో శివకార్తికేయన్ ఒదిగిపోయిన తీరు చూస్తే ఇది ఖచ్చితంగా దేశం గర్వించదగ్గ సినిమా కాబోతోంది అనిపిస్తోంది. ట్రైలర్ లోని యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక సినిమాలో నెక్ట్స్ లెవల్ లో ఉంటాయని వేరే చెప్పక్కర్లేదేమో. సినిమాలు, అభిమాన హీరోలను దాటి చూడాల్సిన సినిమాలా కనిపిస్తోందీ అమరన్.
టెక్నికల్ గానూ నెక్ట్స్ లెవల్ లో కనిపిస్తోంది. సిహెచ్ సాయి సినిమాటోగ్రఫీ హైలెట్ గా ఉంది. జీవి ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం చాలా బాగా అనిపించింది. ఎలా చూసినా చాలా రోజుల తర్వాత ఓ గొప్ప దేశభక్తి నిండిన సినిమా చూడబోతున్నాం అనిపించేలా ఉందీ అమరన్ ట్రైలర్ చూస్తుంటేనే. మరి సినిమా ఎలా ఉంటుందో కానీ.. ఈ ట్రైలర్ కు మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com