Amaran : అమరన్ మొదటి రోజు వసూళ్లు అదిరెన్

Amaran :  అమరన్ మొదటి రోజు వసూళ్లు అదిరెన్
X

శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా అమరన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వచ్చిన ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచాలున్నాయి. శివ కార్తికేయన్ ఫస్ట్ టైమ్ ఆర్మీ ఆఫీసర్ రోల్ చేయడం, సాయి పల్లవి మొదటి సారి అతనికి జోడీగా నటించడంతో పాటు కమల్ హాసన్ నిర్మాత కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా అందుకుంటారు అనే నమ్మకం కూడా అందర్లో ఉంది. అయితే సినిమా మరీ ఆశించినంత గొప్పగా లేదు కానీ.. ఓ గొప్ప ఆర్మీ యోధుడి కథ కాబట్టి ఎవరూ ఎక్కువగా విమర్శించడం లేదు. బట్ శివకార్తికేయన్ క్రేజ్ మాత్రం బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అయింది.

దీపావళి రోజు విడుదలైన అమరన్ కు మొదటి రోజు కలెక్షన్స్ అదిరిపోయాయి. ఫస్ట్ డే వాల్డ్ వైడ్ గా 34.04 కోట్లు వచ్చాయి. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి 4. 40 కోట్లు రావడం విశేషం. ఇక్కడ సాయి పల్లవి ఫ్యాక్టర్ వర్కవుట్ అయిందని చెప్పాలి. తమిళనాడు నుంచి 15 కోట్లకు పైగా వసూళ్లు రావడం అక్కడ శివ కార్తికేయన్ సత్తాను చెబుతుంది. అయితే హిందీ బెల్ట్ నుంచి మినిమం కూడా రాబట్టలేపోయిందీ మూవీ.

ఇక 70 కోట్ల థియేట్రికల్ టార్గెట్ తో రిలీజ్ అయింది అమరన్. ఈ ఫిగర్స్ చూస్తుంటే ఆ మొత్తం సాధించడం పెద్ద కష్టమేం కాదు అనిపించినా.. ఇతర రాష్ట్రాల్లో కాస్త ఇబ్బందిగానే ఉందనేది వాస్తవం. అంటే మాగ్జిమం ఇక తమిళులే ఈ మూవీని కాపాడుకోవాల్సి ఉంటుంది.

Tags

Next Story