Actor Suhas Birthday : పోస్టర్ తో సుహాస్ కు బర్త్ డే విషెస్

'కలర్ ఫొటో', 'రైటర్ పద్మభూషణ్' వంటి సినిమాలతో తన టాలెంట్ ను బయటపెట్టి, ప్రేక్షకులకు హృదయాలు దోచేసిన సుహాస్.. ఇప్పుడు 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు దుష్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజుల క్రితం రిలీజైన ప్రీ లుక్ పోస్టర్ సినీ అభిమానుల్లో సంచలనం సృష్టించింది. కాగా తాజాగా సుహాస్ బర్త్ డే (ఆగస్టు 19) సందర్భంగా మేకర్స్ మరో పోస్టర్ ను రివీల్ చేశారు. దాంతో పాటు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ పోస్టర్ లో సుహాస్ బనియన్, లుంగీ, మెడలో ఎర్రటి రుమాలు, కాళ్లకు స్లిప్పర్ చెప్పులతో ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. నేచురల్ కటౌట్ తో సుహాస్ ఈ పోస్టర్ లో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఇంతకుముందు రివీల్ చేసిన పోస్టర్ సినిమా థీమ్‌ను తెలియజేసేట్టుగా డిజైన్ చేశారు. ఈ చిత్రం మ్యారేజ్ బ్యాండ్ చుట్టూ తిరుగుతుందని ఈ పోస్టర్ ద్వారా వెల్లడైంది. ఇందులో సుహాస్ తన బ్యాండ్ సభ్యులతో కలిసి మల్లికార్జున సెలూన్ షాప్ ముందు నిలబడి ఉన్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే రివీల్ అయిన టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ మేకర్స్ క్రియేటివ్ పార్శ్వాన్ని వర్ణిస్తుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకటేష్ మహాకు చెందిన GA2 పిక్చర్స్, మహాయానా మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉంది. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన జీఏ 2 పిక్చర్స్.. సుహాస్ పాత్రను మల్లిగాడు అని మెన్షన్ చేస్తూ ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేసింది. దాంతో పాటు 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' టీజర్ త్వరలోనే విడుదల కానుందని రాసుకువచ్చింది.
Here's team #AmbajipetaMarriageBand wishing their Malligadu aka @ActorSuhas a very very Happy Birthday 🥁🎺🔥#AmbajipetaMarriageBand Teaser Out Very Very Soon... ❤️🔥#BunnyVas @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @GA2Official @Mahayana_MP pic.twitter.com/bDDacCiYjL
— GA2 Pictures (@GA2Official) August 19, 2023
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com