Bollywood: అణకువగా ఎలా ఉండాలో అతనే నేర్పించారు : అలెక్స్ ఓ'నెల్

Bollywood: అణకువగా ఎలా ఉండాలో అతనే నేర్పించారు : అలెక్స్ ఓనెల్
X
అతన్ని, అతని ప్రవర్తను చూసి చాలా నేర్చుకున్నానన్న అలెక్స్ ఓనెల్

బాలీవుడ్ నటుడు అలెక్స్ ఓ'నెల్ చాలా కాలంగా సినీ చలనచిత్ర పరిశ్రమలో చురుకుగా పనిచేస్తున్నారు. హిందీ సినిమా నుంచి దక్షిణాదిలో ప్రాంతీయ చిత్రాల వరకు, అతను అనేక భాషల చిత్రాలలో నటించి ఇప్పటికే తన సత్తాను నిరూపించుకున్నాడు. అంతే కాదు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ షో ఆర్యలోనూ బాబ్ అనే ముఖ్యమైన పాత్రను పోషించి, బుల్లి తెర ప్రేక్షకులను సైతం అలరించాడు. అయితే తాజాగా ఆయన బిగ్ బి అమితాబ్ బచ్చన్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

"అణకువగా ఎలా ఉండాలో, పరిశ్రమలో ఎలా మసులుకోవాలో తనకు పరిశ్రమలోని మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ తప్ప మరెవరూ నేర్పించలేద"ని అమెరికన్ సంతతికి చెందిన బాలీవుడ్ నటుడు అలెక్స్ ఓ'నెల్ వెల్లడించారు. "నేను చాలా మంది స్టార్స్, అక్షయ్ కుమార్, సుస్మితా సేన్, రాజ్ కుమార్ రావు మొదలైన వారితో కలిసి పనిచేశాను. కానీ బచ్చన్ చీనీ కమ్ షూటింగ్ సమయంలో నేను అతన్ని, అతని ప్రవర్తనను చూసి చాలా నేర్చుకున్నాను" అని చెప్పుకొచ్చాడు.

దాంతో పాటు సుస్మితా సేన్ తో ఆర్య చేసినప్పటి రోజులను, ఆయనతో అనుబంధాన్ని కూడా ఓనెల్ గుర్తు చేసుకున్నాడు. "షూట్ తర్వాత మేము పూల్ పక్కన కూర్చుని గాడ్‌ఫాదర్‌ని చూశాము" అని చెప్పాడు. "మా సన్నివేశం ముగిసిన తర్వాత కూడా, అమితాబ్ నాకు సూచనలను ఇస్తూనే ఉన్నాడు. నిజానికి అది అతని పని కాదు, కానీ అతను తన స్టార్ డమ్ ఉన్నప్పటికీ అలా చెప్పడం గొప్ప విషయం" అని ఓనెల్ బిగ్ బి గొప్పతనాన్ని తెలిపాడు.

ఇక అలెక్స్ ఓ'నెల్ విషయానికొస్తే.. అతను అమెరికన్ సంతతికి చెందిన భారతీయ నటుడు-సంగీతకారుడు. ఆయన అనేక ఇండియ్ భాషలతో పాటు ఇంగ్లీష్ సినిమాలు, సిరీస్ లు, మ్యూజిక్ వీడియోలలోనూ కనిపించాడు. గోలోండాజ్, రూహి, ఆర్య, మెయిన్ ఔర్ చార్లెస్, చీనీ కమ్, మద్రాసపట్టినం, జోకర్, ఏతి ఒభిజాన్, చిట్టగాంగ్, ఉరుమి (ఏక్ యోధా షూర్వీర్) అతని ప్రసిద్ధ రచనలలో ముఖ్యమైనవిగా చెప్పవచ్చు.

ఓ'నెల్... లోయిన్స్ ఆఫ్ పంజాబ్ ప్రెజెంట్స్ (2007), చీనీ కమ్(2007) వంటి హిందీ చిత్రాల్లోనూ నటించాడు. అంతే కాదు పలు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్, క్యామియోగానూ నటించాడు. అంతకుముందు అతను విదేశాలలో టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో పనిచేశాడు. ఆ తర్వాత అతను నాచ్ బలియే (సీజన్ 3, 2007) మూడవ సీజన్‌లో పాల్గొని ప్రసిద్ధి చెందాడు. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ సెలబ్రెటీ డ్యాన్స్ కాంపిటేషన్..


Tags

Next Story