Amitabh Bachchan: అమితాబ్ ని వృద్ధుడు అంటూ ట్రోల్స్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన బిగ్ బీ

Amitabh Bachchan: అమితాబ్ ని వృద్ధుడు అంటూ ట్రోల్స్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన బిగ్ బీ
Amitabh Bachchan: ఈ మధ్య కొందరు 11.30కే మద్యం తాగుతున్నారు అని అంటే.. అమితాబ్ మాత్రం తాను తాగనని, అయితే ఇతరులకు వినోదాన్ని పంచుతానని బదులిచ్చారు.

Amitabh Bachchan: సంస్కారహీనులకు కూడా సావధానంగా రిప్లై ఇచ్చి భేష్ అనిపించుకున్నారు అమితాబ్.. విమర్శించడంమే పనిగా పెట్టుకునే వాళ్లకి అదే స్థాయిలో పంచ్ వేసి నోర్మూయించారు బిగ్ బీ.

ఆదివారం ఉదయం 11.30కు ఆలస్యంగా నిద్ర లేచిన అమితాబ్ తన ఫేస్ బుక్ ఖాతాదారులకు శుభోదయం శుభాకాంక్షలు తెలిపారు. దానికి కొంత మంది నెటిజన్స్ పనిగట్టుకుని విమర్శించారు వయసు తారతమ్యాలు మరిచి ప్రవర్థించారు.. ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఏంటి.. మధ్యాహ్నం అవుతుంటే అని ఒకరు రిప్లే ఇస్తే దానికి అమితాబ్.. రాత్రంతా షూటింగ్ చేసి తెల్లవారు జామున ఇంటికి వచ్చాను. దాంతో ఆలస్యంగా నిద్ర లేచాను.. అందుకే ఇప్పుడు శుభోదయం అని చెప్పాను. దానిని తప్పుగా భావిస్తే క్షమించండి అని అన్నారు.

మరొకరు ఇది మధ్యాహ్నం ముసలోడా అని రాస్తే.. దానిక్కూడా కూల్ గా రియాక్టయ్యారు అమితాబ్. మిమ్మల్ని ఎవరూ ముసలోడు అని పిలవకూడదు. మీరు చాలా కాలం జీవించాలని కోరుకుంటున్నాను అని అద్ధిరిపోయే కౌంటర్ ఇచ్చారు. అలాగే మరికొందరు అమితాబ్ ని విమర్శించడం మొదలు పెట్టారు.. దానికి ఆయన కూడా అదే స్థాయిలో రిప్లై ఇచ్చి నెటిజన్ల నోళ్లు మూయించారు.

మరొక నెటిజన్ ఈ మధ్య కొందరు 11.30కే మద్యం తాగుతున్నారు అని అంటే.. అమితాబ్ మాత్రం తాను తాగనని, అయితే ఇతరులకు వినోదాన్ని పంచుతానని బదులిచ్చారు.

కాగా, అమితాబ్ తదుపరి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన 'బ్రహ్మాస్త్ర'లో కనిపించనున్నారు, ఇందులో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలో నటించారు. సెప్టెంబర్ 9 న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అమితాబ్ తన తదుపరి ప్రాజెక్ట్ ఉంఛై మరియు హాలీవుడ్ చిత్రం 'ది ఇంటర్న్' యొక్క హిందీ రీమేక్‌లో కూడా కనిపించనున్నారు.

79ఏళ్ల వయసులోనూ తాను చేస్తున్న పనిని ఉద్యోగంలా భావించి ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు.. అలాంటి వ్యక్తిని చూసి కొంతైనా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి కానీ ఇలా విమర్శించడం, నోటికి వచ్చినట్లు మాట్లాడడం తగదని అమితాబ్ అభిమానులు మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story