అమితాబ్ ఇంట్లో అద్దెకుంటున్న కృతి సనన్.. రెంటు వింటే షాకే

అమితాబ్ ఇంట్లో అద్దెకుంటున్న కృతి సనన్.. రెంటు వింటే షాకే
ఆ ఇల్లు మాకంటే మాకు కావాలి అని పోటీ పడ్డారట బాలీవుడ్ తారలు.. ఎట్టకేలకు కృతి సనన్ ఆ ప్లాట్ దక్కించుకుంది.

ముంబయిలో సొంత ఇల్లు ఉండి దాన్ని అద్దెకు ఇచ్చుకుంటే హ్యాపీగా బతికేయొచ్చేమో. అద్దెలు అంత ఎక్కువగా ఉంటాయి మరి. బిగ్ బీ అమితాబ్ ఇంట్లో అద్దెకు ఉంటున్న బాలీవుడ్ బ్యూటీ నెలకు ఆయనకు రూ.10లక్షలు అద్దె చెల్లిస్తుందట. ముంబై సౌత్ అంధేరీలో ఇటీవల కొనుగోలు చేసిన డుప్లెక్స్ ప్లాటును అద్దెకు ఇవ్వాలనుకున్నారు అమితాబ్.. దాంతో ఆ ఇల్లు మాకంటే మాకు కావాలి అని పోటీ పడ్డారట బాలీవుడ్ తారలు.. ఎట్టకేలకు కృతి ఆ ప్లాట్ దక్కించుకుంది. అద్దే రూ.10 లక్షలు అయితే అడ్వాన్స్ ఎంతుంటుందో అనుకుంటే రూ.60 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్నారట. అగ్రిమెంట్ ప్రకారం కృతి సనన్ ఆ ఇంట్లో అక్టోబర్ 2023 వరకు ఉండొచ్చట.

అంధేరిలోని లోకండ్‌వాలా రోడ్‌లో ఉన్న అట్లాంటిస్ బిల్డింగ్‌లోని 27, 28వ అంతస్థులో అమితాబ్ ఇల్లు ఉంది. ఈ ఇంటిని ఆయన 2020 డిసెంబరులో రూ.31 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. అమితాబ్‌కి ముంబైలో ఆస్తులు బాగానే ఉన్నాయి. జూహూలో ఉన్న వత్స, అమ్ము అనే బంగ్లాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అద్దెకు ఇచ్చారు. వీటి అద్దెలు నెలకు దాదాపు రూ. 20 లక్షలు వస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story