Kangana Ranaut: కంగనా వీడియోను షేర్ చేసిన బిగ్‌బీ.. మళ్లీ వెంటనే డిలీట్..

Kangana Ranaut: కాంట్రవర్సీలు క్రియేట్ చేయడంలోనే కాదు.. సినిమాలు చేయడంలో కూడా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కు సెపరేట్ స్టైల్ ఉంది. అందుకే కథల ఎంపికల విషయంలో కంగనా తొందరపడదు. తాను చేసే ప్రతీ చిత్రం ప్రేక్షకులపై ఎంతోకొంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలి అనుకునే మనస్తత్వం తనది. అయితే తాజాగా కంగనా అప్‌కమింగ్ సినిమా వీడియో సాంగ్‌ను షేర్ చేసి వెంటనే డిలీట్ చేశాడు బాలీవుడ్ బిగ్‌బీ. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
కంగనా రనౌత్ చివరిగా.. 'తలైవి' సినిమాలో కనిపించింది. తమిళనాడు అమ్మ జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కంగనా యాక్టింగ్‌కు మంచి మార్కులే పడినా.. కమర్షియల్‌గా మాత్రం సినిమా సక్సెస్ కాలేకపోయింది. అందుకే మళ్లీ రూటు మార్చి కమర్షియల్ సినిమాలవైపు అడుగులేస్తోంది కంగనా. ప్రస్తుతం రజనీష్ ఘాయ్ దర్శకత్వంలో 'ధాకడ్' అనే చిత్రంలో నటిస్తోంది.
'ధాకడ్' చిత్రంలో కంగనా రనౌత్‌తో పాటు అర్జున్ రాంపాల్, దివ్యా దత్తా ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి తాజాగా మొదటి సాంగ్ ప్రోమో విడులదయ్యింది. ఈ ప్రోమోను తన సోషల్ మీడియాలో షేర్ చేసి ధాకడ్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపాడు అమితాబ్ బచ్చన్. కానీ కాసేపట్లోనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసేశాడు. ఇంతకీ బిగ్‌బీ ఎందుకలా చేశాడంటూ బాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. మరి దీనిపై కంగనా ఎలా స్పందిస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com