Allu Arjun : అల్లు అర్జున్ కు థ్యాంక్స్ చెప్పిన అమితాబ్ బచ్చన్

Allu Arjun :  అల్లు అర్జున్ కు థ్యాంక్స్ చెప్పిన అమితాబ్ బచ్చన్
X

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ థ్యాంక్స్ చెబుతూ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో చాలామంది సడెన్ గా ఆయన ఈయనకెందుకు థ్యాంక్స్ చెప్పాడు అంటూ ఆరాలు తీస్తున్నారు. అయితే తన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప 2 ప్రమోషన్స్ లో భాగంగా హిందీలో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరూ అని అల్లు అర్జున్ ను ప్రశ్నించింది బాలీవుడ్ మీడియా. దానికి అతను ఆల్ టైమ్ అమితాబ్ బచ్చన అని చెప్పడంతో పాటు అతని నటనా ప్రస్థానం తనను ఇన్ స్పైర్ చేస్తుందని.. ఈ వయసులో కూడా అంత అందంగా నటించడం ఆయనకే సాధ్యం అయిందని.. తనూ ఆ వయసుకు వస్తే ఆయన్లాగే నటించాలని కోరుకుంటున్నా అని అమితాబ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. దీనికి రియాక్ట్ అవుతూ అమితాబ్ పోస్ట్ పెట్టాడు.

'అల్లు అర్జున్ గారూ.. మీ మాటలకు పొంగిపోయాను. మీరు నా అర్హత కంటే ఎక్కువ పొగిడారు. మేమంతా నీ హార్డ్ వర్క్, టాలెంట్ కు అభిమానులం. మీరు ఇలాగే మమ్మల్ని ఇన్స్ స్పైర్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ మీ విజయాలు ఇంకా కొనసాగాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను.."

అంటూ అమితాబ్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నిజానికి అల్లు అర్జున్ లాంటి వాళ్లు చాలామందే అమితాబ్ ను పొగుడుతూ ఉంటారు. కానీ ఈయనకు రెస్పాండ్ అయినట్టుగా ఇంకెవరికీ రెస్పాండ్ కాలేదు అమితాబ్. అందుకే అంటారు సక్సెస్ లో ఉంటే ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉంటుందో అని.

Tags

Next Story