Amrita Rao: ఎవ్వరికీ తెలియకుండా నటి సీక్రెట్ మ్యారేజ్.. రెండేళ్ల తర్వాత నిజం బయటికి..

Amrita Rao: కొంతమంది హీరోయిన్లు పెళ్లయ్యే వరకు కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత కొంతకాలం కొనసాగించినా.. పలు కారణాల వల్ల కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టక తప్పదు. అయితే ఓ నటి మాత్రం అటు కెరీర్ డిస్టర్బ్ అవ్వకుండా.. తాను ప్రేమించిన వాడిని వెంటనే పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశ్యంతో ఓ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆ నటి ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానెళ్ ద్వారా బయటపెట్టింది.
మహేశ్ బాబు హీరోగా నటించిన 'అతిధి' సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది అమృత రావు. నటించింది ఒక్క సినిమానే కానీ అందులో తన క్యూట్ యాక్టింగ్‌తో అందరినీ కట్టిపడేసింది. తనకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోయినా.. హిందీలో మాత్రం కొంతకాలం పాటు తన హవా కొనసాగింది. అయితే తన కెరీర్ మొదట్లోనే తనకు పెళ్లా? కెరీరా? అన్న ఇబ్బంది మొదలయ్యిందట.
కెరీర్ అప్పుడప్పుడే మొదలుపెడుతున్న అమృత రావుకు తన బాయ్‌ఫ్రెండ్ ఆర్‌జే అన్మోల్ పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశాడట. అయితే తన కెరీర్ అప్పుడే మొదలయ్యిందని.. ఒకవేళ తాను అప్పుడే పెళ్లి చేసుకుంటే ప్రేక్షకులు రకరకాల రూమర్స్ క్రియేట్ చేస్తారని భయపడిందట అమృత. ఇప్పటిలాగా అప్పట్లో తమ భావాలను వ్యక్తపరచడానికి సోషల్ మీడియా కూడా లేదు కదా అని గుర్తుచేసుకుంది.
నాలుగైదు సంవత్సరాల వరకు తన కెరీర్ కోసం పెళ్లిని పక్కన పెట్టాలి అని నిర్ణయించుకుందట అమృత. అయితే అన్మోల్.. తాము అప్పుడే పెళ్లి చేసుకుందామని కానీ కొన్నేళ్ల వరకు ఈ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా ఉంచుదామని సలహా ఇచ్చారట. అమృతకు ఈ సలహా నచ్చడంతో వీరు 2014లో పెళ్లి చేసుకున్నారు. కానీ 2016లో వీరి వివాహం గురించి బయట ప్రపంచానికి చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com