Amrita Singh Ravi Shastri: సైఫ్ అలీ ఖాన్ మాజీ భార్యతో రవిశాస్త్రి ప్రేమాయణం.. లవ్, బ్రేకప్ వెంటవెంటనే..

Amrita Singh Ravi Shastri: సినీ రంగంలో డేటింగ్ కల్చర్ ఎక్కువని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఆ కల్చర్ ప్రస్తుతం ఇతర విభాగాల్లోకి కూడా వెళ్లిపోయింది. సినీ రంగంలోని అమ్మాయి, క్రికెటర్ అయిన అబ్బాయి.. ఇలాంటి ప్రేమ వ్యవహారాల గురించి ఆనాటి నుండి వింటూనే ఉన్నాం. అయితే అందరూ మర్చిపోయిన అలాంటి ఓ అలనాటి ప్రేమకథను ఇప్పుడు గుర్తుచేసుకుందాం.
అమృతా సింగ్.. ఈ పేరు ఇప్పుడు సినీ ప్రపంచంలో దాదాపుగా ఫేడవుట్ అయిపోతోంది కానీ ఒకప్పుడు తనే కుర్రకారుకు క్రష్. ఇప్పుడు తన కూతురు సారా అలీ ఖాన్ జమానా నడుస్తోంది. అప్పుడప్పుడే సినిమాల్లోకి వచ్చిన అమృతా సీనియర్ నటుడు సన్నీ డియోల్‌తో ప్రేమలో పడింది. అప్పటికీ అతడికి పెళ్లయిపోయినా కూడా ఆ విషయం తనకు తెలీకుండా జాగ్రత్తపడి చాలాకాలం తనకు ప్రేమికుడిగానే చలామణి అయ్యాడు. ఒకరోజు నిజం బయటపడడంతో సన్నీతో తెగదెంపులు చేసుకుంది అమృత.
సన్నీ డియోల్‌తో విడిపోయిన అమృత.. ఆ తర్వాత పూర్తిగా సినిమాలే పైనే దృష్టిపెట్టింది. క్షణం తీరిక లేకుండా వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది. తనకు సమయం కుదిరినప్పుడు అప్పుడప్పుడు స్నేహితులతో పార్టీలకు, షికార్లకు వెళ్తుండేది అమృత. అలాంటి ఒక సమయంలోనే క్రికెటర్ రవి శాస్త్రిని కలిసింది. వీరిద్దరు చాలా తొందరగా స్నేహితులయిపోయారు. ఫోన్ నెంబర్లు మార్చుకుని రెగ్యులర్‌గా టచ్‌లో ఉండేవారు.
అప్పట్లో ఆల్ రౌండర్ రవిశాస్త్రికి క్రికెట్ రంగంలో చాలా క్రేజ్ ఉండేది. కానీ అమృతకు క్రికెట్ అంటే పెద్దగా ఇష్టముండేది కాదు. అయినా కూడా రవి శాస్త్రితో కలిసి క్రికెట్ టూర్లకు వెళ్లేది. రవి శాస్త్రి కూడా అంతే.. సినిమాలంటే పెద్దగా ఆసక్తి లేకపోయినా.. అమృత కోసం తన షూటింగ్ సెట్లకు వెళ్లేవాడు. ఇలా ఎప్పుడు చూసినా వీరు కలిసి కనిపించడంతో వీరిపై ప్రేమ పక్షులు అనే ముద్ర వేసేశారు అభిమానులు.
ఒక మ్యాగజిన్ కవర్ కోసం ఫోటోషూట్‌లో కలిసి పాల్గొన్న అమృత, రవిశాస్త్రి.. వారి రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించేశారు. అప్పటికీ ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది అన్న వార్తలు వచ్చినా.. వారిద్దరూ అప్పుడే దానికి సిద్ధంగా లేమని తేల్చి చెప్పేశారు. కొంతకాలం ఎక్కడ చూసినా ఈ ప్రేమ జంట గురించే వార్తలు వినిపిస్తుండేవి. కానీ ఈ ప్రేమ.. పెళ్లి వరకు వెళ్లలేకపోయింది.
ఇక సినిమాలను మానేసి పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని అమృత సింగ్‌కు ప్రపోజ్ చేశారు రవి శాస్త్రి. కానీ అప్పుడప్పుడే సినిమాల్లో స్టార్‌డమ్ చూస్తున్న అమృత దానికి ఒప్పుకోలేదు. ఈ విషయంలోనే వారిద్దరికీ విబేధాలు రావడంతో వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత రవి శాస్త్రి.. రీతూ సింగ్‌ను, అమృత సింగ్.. సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకున్నారు. కానీ కొంతకాలం తర్వాత ఇరు జంటలు విడాకులు తీసుకున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com