Amritha Aiyer : ప్రదీప్ హీరోయిన్ కి లక్కీ ఛాన్స్..!

టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ గా డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.. 2016లో అ! సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.. ఆ తర్వాత కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో వరుసగా హిట్స్ కొట్టాడు. ఇప్పుడు 'హనుమాన్' అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీగా వస్తోన్న ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటిస్తున్నాడు. కాగా హీరోయిన్ గా అమృత అయ్యర్ నటిస్తోంది. ఇందులో ఆమె మీనాక్షి అనే పాత్రను పోషిస్తున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియోని కూడా రిలీజ్ చేశారు. అమృత అయ్యర్ ఎవరో కాదు.. యాంకర్ ప్రదీప్ హీరోగా వచ్చిన ముప్పైరోజుల్లో ప్రేమించుకోవడం ఎలా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈమె తెలుగులో హనుమాన్ సినిమాతో పాటుగా అర్జునా.. పాల్గునా అనే సినిమాలో కూడా నటిస్తోంది.
Makkal Selvan @VijaySethuOffl sir introduces as #Meenakshi from the world of Anjanadri 🏔
— Amritha (@Actor_Amritha) December 13, 2021
▶️https://t.co/DzvjsY8Wkx#HanuMan
The First Pan-Indian SuperHero Film
A @PrasanthVarma Film🎥 @tejasajja123 @Niran_Reddy @Primeshowtweets @Chaitanyaniran #HanuManTheOrigin pic.twitter.com/5tZ1Q69t2g
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com