Amrutha Pranay: దీపావళి స్పెషల్ సాంగ్‌లో అమృత ప్రణయ్ సందడి చూశారా!

Amrutha Pranay (tv5news.in)
Amrutha Pranay: ప్రస్తుతం ఉన్న బుల్లితెర యాంకర్లలో ఎప్పుడూ యాక్టివ్‌గా ప్రేక్షకులను ఎప్పుడూ ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది లాస్య. ఫ్యామిలీ లైఫ్‌పై దృష్టిపెట్టి కొంతకాలం యాంకరింగ్‌కు దూరంగా ఉన్న లాస్య.. బిగ్ బాస్ సీజన్4లో కంటెస్టెంట్‌గా వచ్చి మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత 'లాస్య టాకీస్' పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్‌ను పెట్టి అందరినీ ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఆ ఛానెల్‌లో విడుదలయిన ఒక వీడియో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
అమృత ప్రణయ్.. తన గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఒక విషాదకరమైన ఘటన వల్ల అమృత ఎవరో తెలుగు రాష్ట్రమంతా తెలిసింది. గత కొంతకాలంగా తన పర్సనల్ లైఫ్‌తో బిజీ అయిపోయిన అమృతను తన వీడియోలో మెరిపించింది లాస్య. దీపావళి సందర్భంగా విడుదల చేసిన ఈ పాటలో లాస్య, అమృత కలిసి స్టెప్పులేశారు.
ఈ స్పెషల్ సాంగ్‌లో లాస్య, అమృతతో పాటు యూట్యూబర్‌లు గలాటా గీతూ, అలేఖ్య కూడా ప్రేక్షకులను మెప్పించారు. ఇందులో వీరందరూ కలిసి వేసిన స్టెప్పులు చూసిన వారిని విపరీతంగా ఆకట్టుకోవడంతో యూట్యూబ్‌లో ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండింగ్ లిస్ట్‌లో దూసుకుపోతోంది. ఇలాంటివి చేయడంలో లాస్య దిట్ట అని అందరికీ తెలిసినా.. అమృత ప్రణయ్ కూడా తనతో చేతులు కలపడం వల్ల పాటకు మరింత బ్యూటీ యాడ్ అయ్యింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com