Nani's HIT 3 : రోజులు లెక్కపెడుతున్న నాని

నేచురల్ స్టార్ నాని రూట్ మార్చాడు. ఇన్నాళ్లు మనోడు పక్కింటి కుర్రాడు అనుకున్నారు జనం. కానీ ఆ జనం కూడా అలాగే మోసపోయారు అంటూ ఆ మధ్య వచ్చిన మూవీ టీజర్ లో చెప్పడంతో అతగాడూ అగ్రెసివ్ అయిపోయాడు అని అర్థం అయింది. వరుసగా మాస్ మంత్రం జపిస్తూ.. ఆ తరహా కథలే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ముందుగా వస్తోన్న మూవీ ‘హిట్3’. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ మూవీ మే 1న విడుదల కాబోతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఓ కొత్త పోస్టర్ విడుదల చేశాడు. ఆ పోస్టర్ కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే.. హిట్ 3 కి ఇంకా 30 రోజులే ఉందని చెప్పడం. మామూలుగా ఇలాంటివి స్టార్ హీరోల సినిమాలకు వస్తుండటం చూస్తూనే ఉన్నాం. అందుకే నాని కూడా వేశాడు. అయితే ఆ మధ్య ద ప్యారడైజ్ మూవీకి కూడా ఇదే పోస్టర్ వేశాడు. ప్యారడైజ్ ఇన్ 365 డేస్ అనేదే ఆ పోస్టర్. ఇలా రోజులు లెక్కలు చూపిస్తూ.. తన సినిమాల రిలీజ్ డేట్స్ కు సంబంధించిన రోజులు లెక్కలు పెడుతున్నాడు నాని.
నిజానికి ఈ తరహా పోస్టర్స్ ఫ్యాన్ పేజ్ ల నుంచి లేదా పిఆర్వోల నుంచి వేస్తుంటారు. బట్ నాని తనే స్వయంగా ఆయా పోస్టర్స్ ను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెడుతున్నాడు. మొత్తంగా హిట్ 3 తో అతను కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ లో నిర్మించాడు. మరి ఈ థర్డ్ కేస్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com