Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ కాంత టీజర్.. భలే ఉందే

మోస్ట్ టాలెంటెడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ నుంచి ఓ సినిమా వస్తోందంటే బలమైన కథ గ్యారెంటీ అనే నమ్మకం ప్రేక్షకుల్లో నిండిపోయింది. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటేనే అతను కమిట్ అవుతాడు. పైగా లాంగ్వేజ్ బారికేడ్స్ కూడా లేవు. మళయాలంలో మొదలుపెట్టి తమిళ్, హిందీతో పాటు తెలుగులోనూ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. తెలుగులో మహానటితో మెస్మరైజ్ చేస్తే.. తర్వాత సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ప్రస్తుతం దగ్గుబాటి రానాతో కలిసి నిర్మాతగానూ మారి రూపొందిస్తోన్న సినిమా కాంత. ఇవాళ దుల్కర్ బర్త్ డే సందర్భంగా కాంత టీజర్ ను విడుదల చేశారు.
కాంత టీజర్ చూడగానే మహానటి గుర్తొస్తుంది. అలా కట్ చేశారు. అయితే ఇది నిజంగా కాంత చుట్టూ సాగే కథ కాదు. తండ్రి కొడుకుల మధ్య సంఘర్షణ. విశేషం ఏంటంటే.. ఈ మూవీలో తండ్రి దర్శుకుడు అయితే, కొడుకు హీరో. వీరి మధ్య ఈగో క్లాష్. ఆ ఈగో వీరి సినిమా ప్రయాణాన్ని ఎక్కడి వరకూ తీసుకువెళ్లింది అనేది కథ అనేలా ఉంది టీజర్. రానా కూడా నటిస్తున్నా.. కేవలం దుల్కర్ కోసమే కట్ చేశారు టీజర్. అందులోనే తండ్రి కొడుకులు ఏకంగా సెట్స్ లోనే కొట్టుకునేలా ఉన్న సన్నివేశాలు బలే ఉన్నాయి. పైగా కలరింగ్ అంతా బ్లాక్ అండ్ వైట్ గా ఉండటం ఎసెట్ గా కనిపిస్తోంది. తన కొడుకును స్టార్ ను చేసిన డైరెక్టర్ అయిన తండ్రి.. తర్వాత అతన్ని ఎందుకు ద్వేషిస్తాడు.. ఏకంగా చంపేసే ప్రయత్నం వరకూ ఎందుకు వెళ్లాడు. వీరి మధ్య ‘‘శాంత’’ సినిమా రేపిన చిచ్చు ఏంటీ అనే పాయింట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సో.. సినిమా పరంగా చూస్తే సినిమాలో ఈ కథ పేరు శాంత. కానీ దర్శకుడిని డామినేట్ చేసిన హీరో అన్నీ తానే అయ్యి.. ఆ టైటిల్ ను ‘కాంత’అని మారుస్తాడు. పైగా ఇప్పుడు ఇలా ఉంటేనే చూస్తారు అంటాడు.
మొత్తంగా దుల్కర్ నుంచి మరో బలమైన కథ వస్తోందనేది టీజర్ తోనే అర్థం అయింది. ఇక ఈచిత్రంలో కాంతగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. తనూ క్యూట్ గా ఉంది. తండ్రిగా సముద్రఖని సరైన ఛాయిస్ అని టీజర్ తోనే తెలిసిపోతుంది. సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి టెక్నికల్ టీమ్ అంతా మనకు పెద్దగా తెలిసిన వారు కాకపోవడం విశేషం. ఇక సినిమాను సెప్టెంబర్ 12 విడుదల చేయబోతున్నట్టు ఈ టీజర్ తో పాటు ప్రకటించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com