RRR Movie: 'ఆర్ఆర్ఆర్'లో ఎన్‌టీఆర్ అదిరిపోయే ఎలివేషన్ సీన్ డిలీట్.. బయటపెట్టిన నటుడు..

RRR Movie: ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌లాంటి ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి 'ఆర్ఆర్ఆర్'లాంటి మల్టీ స్టారర్‌ను తెరకెక్కించాడు రాజమౌళి. ఏ క్యారెక్టర్ తక్కువ కాదు అన్నట్టుగా ఇద్దరికీ సమాన్యమైన ప్రాధాన్యత ఇచ్చాడు. క్యారెక్టరైజేషన్ విషయంలో, ఎలివేషన్స్ విషయంలో ఇద్దరికీ పోటీపోటీగా సీన్లు ఉన్నాయి. కానీ ఎన్‌టీఆర్ అభిమానులు మాత్రం తమకు హీరోకు అన్యాయం జరిగిందన్న వాదనను వదలట్లేదు. దానికి తోడుగా ఎన్‌టీఆర్ ఎలివేషన్ సీన్ ఒకటి డిలీట్ అయ్యిందన్న విషయం బయటికొచ్చింది.
ఆర్ఆర్ఆర్ విడుదలయినప్పటి నుండి ఇందులో ఎన్‌టీఆర్ కంటే రామ్ చరణ్ డామినేషన్ ఎక్కువగా ఉందంటూ వాదనలు వినిపిస్తున్నాయి. కొమురం భీముడిగా తన హీరోను చూడాలనుకున్న అభిమానులు నిరాశపడుతూ సినిమాపై కామెంట్లు చేస్తు్న్నారు. అయితే ఎన్‌టీఆర్‌ను ఎలివేట్ చేసే హైలెట్ సీన్ ఒకటి డిలీట్ చేశారని.. ఈ సినిమాలో నటించిన సపోర్టింగ్ యాక్టర్ బయటపెట్టాడు.
ఎన్‌టీఆర్‌ను బ్రిటీష్ సైన్యం కొట్టి, జైలులో తీసుకొచ్చి పడేసే సీన్ అది. అందులో తన తోటి ఖైదీలంతా ఎన్‌టీఆర్‌ను చూసి వారంతా పరిగెత్తుకుంటూ తన దగ్గరకు వెళతారు. ఎన్‌టీఆర్ ఏం మాట్లాడకుండా కూర్చొని ఉంటాడు. మేమేమో ఇలా బ్రిటీష్ వాళ్ళపై పోరాటం చేస్తుంటే, మీరేమో వాళ్ళను కొట్టి ఉచ్చపోయించారు అంటూ అక్కడున్న ఖైదీలు ఎన్‌టీఆర్‌ను పొగుడుతారు. అంతే కాకుండా ఇకపై ఎన్‌టీఆరే తమ నాయకుడు అంటూ నినాదాలు చేస్తారు.
అయితే ఇలాంటి ఓ ఎలివేషన్ సీన్ థియేటర్లలో పడుంటే మరో రేంజ్‌లో ఉండేది ఆ సపోర్టింట్ యాక్టర్ తెలిపాడు. అయితే ఇది చూసిన ఎన్‌టీఆర్ మరింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే రాజమౌళి ఈ సీన్‌ను తొలగించాడంటూ తనపై ఫైర్ అవుతున్నారు. అయితే రాజమౌళికి సపోర్ట్ చేస్తున్నవారు కూడా లేకపోలేదు. మరి ఈ ఫ్యాన్స్ ఫైట్‌పై మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com