Allu Arjun : అల్లు అర్జున్ నుంచి అదిరిపోయే అప్డేట్

Allu Arjun :  అల్లు అర్జున్ నుంచి అదిరిపోయే అప్డేట్
X

ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకు ప్రమోషన్స్ పరంగా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఏ చిన్న విషయాన్ని కూడా వాళ్లు లైట్ తీసుకోవడం లేదు. ముఖ్యంగా ప్యాన్ ఇండియా మూవీస్ కు. అలా అల్లు అర్జున్ నుంచి కూడా ఓ బ్లాక్ బస్టర్ అప్డేట్ రాబోతోంది. అదేంటీ అతని బర్త్ డే అయిన ఏప్రిల్ 8న అతని కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నారు. టైటిల్ అనౌన్స్ మెంట్ అంటే ఏదో సింపుల్ గా కాకుండా.. అదిరిపోయే వీడియో కూడా ఆ టైటిల్ తో పాటు యాడ్ చేయబోతున్నారట. రీసెంట్ గా లోకేష్ కనకరాజ్ మూవీ అనౌన్స్ మెంట్ తోనే అద్భుతం అనిపించాడు కదా అల్లు అర్జున్. అలాంటిది అట్లీ డైరెక్షన్ లో రూపొందుతోన్న మూవీ టైటిల్ అప్డేట్ అంటే మామూలుగా ఉండకూడదు అనే భావించారట. ఆ మేరకు అట్లీ కూడా ఓ అద్భుతమైన వీడియో రెడీ చేయిస్తున్నాడట.

ఇక వీడియోలో మూవీ థీమ్ ఎలివేట్ చేసేలా ఉంటుందట. అలాగే ఈ మూవీ ఎంత స్టైలిష్ గా ఉండబోతోంది అనిపించేలానూ ఉండబోతోందట. ఈ మేరకు రకరకాల ఐడియాస్ తో ఈ వీడియోను రూపొందించబోతున్నారు. అల్లు అర్జున్ తో పాటు దీపికా పదుకోణ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా ఉన్నారనే టాక్ ఉంది. కానీ ఆ హీరోయిన్లు ఎవరూ ఇప్పటి వరకు ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పలేదు. మొత్తంగా అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా ఈ వీడియో ఓ రేంజ్ లో ఉండబోతోంది అనే టాక్ అయితే వినిపిస్తోంది.

Tags

Next Story