Dhanush - Sekhar Kammula : ఇంటెన్స్ లుక్ తో కుబేర పోస్టర్

Dhanush - Sekhar Kammula :   ఇంటెన్స్ లుక్ తో కుబేర పోస్టర్

ఇప్పటి వరకూ సెన్సిబుల్ మూవీ మేకర్ గా పేరు తెచ్చుకున్నాడు శేఖర్ కమ్ముల.. ఫస్ట్ టైమ్ స్టార్స్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. నాగార్జున, ధనుష్ హీరోలుగా ‘కుబేర’మూవీతో రాబోతున్నాడు. రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ లో కనిపించబోతోంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన దగ్గర్నుంచీ ఓ డిఫరెంట్ కాంబోగా హాట్ టాపిక్ గానే ఉంటోంది. సునిల్ నారంగ్ నిర్మిస్తోన్న కుబేరను డిసెంబర్ లో విడుదల చేస్తారు అనే టాక్ ఉంది. ఆ మధ్య రష్మిక బర్త్ డే స్పెషల్ గా విడుదల చేసిన వీడియోతో శేఖర్ కమ్ముల ఓ పెద్ద కథనే చెప్పబోతున్నాడు అనిపించింది.



ఇక లేటెస్ట్ గా వినాయక చవితి సందర్భంగా మరో పోస్టర్ విడుదల చేశారు. చూడగానే ఆకట్టుకునేలా ఉందీ పోస్టర్. నాగార్జున, ధనుష్ ఇద్దరి లుక్స్ ఇంటెన్సిటీతో ఉన్నాయి. వారి కింద ఉన్న ఫోటో చూస్తే ఓ వైపు పేదల గుడెసెలు.. మరోవైపు పెద్దల భవనాలు.. మధ్యలో మంటలు రేగడం చూస్తాం. అలాగే ఇద్దరు హీరోల లుక్స్ ను బట్టి ఇది ప్రతి మనిషీ తనలోకి తాను చూసుకోవాలన్న సందేశంతో కూడిన కథలానూ అనిపిస్తోంది. మొత్తంగా ఈ స్టిల్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందనే చెప్పాలి.

Tags

Next Story