NBK 107 : అభిమానానికి వయసు లేదు.. జై బాలయ్య అని ఈలలు వేసిన బామ్మ..

NBK 107 : నందమూరి బాలకృష్ణ ఫ్యా్న్స్ చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జై బాలయ్య అంటూ చేసే నినాదాలు, రచ్చ మరే ఇతర టాలీవుడ్ యాక్టర్ లేదనిపిస్తుంది. తాజాగా బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వం వస్తున్న మూవీ షూటింగ్ కర్నూలులో జరుగుతోంది. ఈ సినిమా వర్మింగ్ టైటిల్ 'ఎన్బీకే 107గా'. బాలకృష్ణను చూడడానికి కర్నూలు షూటింగ్ స్పాట్‌కు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. జై బాలయ్యా అంటూ నినాదాలు చేశారు.
వారిలో ఓ బామ్మ లేటు వయసులో ఈలలు వేస్తూ.. జై బాలయ్య అని స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్బీకే 107లో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్‌కుమార్ మెయిన్ సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చనున్నారు.
Celebrating the shoot of #NBK107 ❤️ pic.twitter.com/mQb0MteeyB
— Mythri Movie Makers (@MythriOfficial) July 26, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com