Sathyaraj : ‘త్రిబాణధారి బార్భరిక్’ ‘అనగా అనగా కథలా’ పాట విడుదల

Sathyaraj :  ‘త్రిబాణధారి బార్భరిక్’ ‘అనగా అనగా కథలా’ పాట విడుదల
X

సత్య రాజ్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న భారీ చిత్రం ‘త్రిబాణధారి బార్భరిక్’. ఈ మూవీకి దర్శకుడు మోహన్ శ్రీవత్స. వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పాటలు, గ్లింప్స్, టీజర్‌‌లు అంచనాల్ని పెంచేశాయి. ఇక తాజాగా మరో ఫీల్ గుడ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

అనగా అనగా కథలా అంటూ సాగే ఈ పాటను టీకేఆర్ కాలేజ్‌లో విద్యార్థుల సమక్షంలో బుధవారం నాడు కాలేజ్ చైర్మన్ తీగల కృష్ణారెడ్డి రిలీజ్ చేశారు. ఈ పాటను కార్తిక్ ఆలపించారు. ఇంఫ్యూజన్ బ్యాండ్ అందించిన హృద్యమైన బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. ఇక సనరే రాసిన సాహిత్యంతో తాతయ్య అనే ఎమోషన్, మనవరాలితో తాతయ్యకు ఉండే అనుబంధాన్ని చక్కగా వివరించారు. ఇక పాటను రిలీజ్ చేసిన అనంతరం

సత్య రాజ్ మాట్లాడుతూ .. ‘టీకేఆర్ కాలేజ్‌లోని విద్యార్థుల ఉత్సాహం, ఎనర్జీ చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇలా పద్నాలుగు వేల మంది విద్యార్థుల సమక్షంలో పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. మా పాటను విడుదల చేసిన తీగల కృష్ణారెడ్డి గారికి.. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన హరనాథ్ రెడ్డి గారికి, అమర్ నాథ్ రెడ్డి గారికి థాంక్స్. త్రిబాణధారి బార్భరిక్ చిత్రంలోని 'అనగా అనగా కథలా' పాటను రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ .. ‘నా మొదటి హీరో సత్య రాజ్ గారు అవ్వడం నా అదృష్టం. 170 చిత్రాల్లో హీరోగా చేసిన సత్య రాజ్‌ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మా చిత్రంలోని పాటను ఈ కాలేజీలో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. పాటను విడుదల చేసేందుకు సహకరించిన కాలేజ్ యాజమాన్యానికి థాంక్స్. మా చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది’ అని అన్నారు.

Tags

Next Story