Anaganaga Oka Raju TRAILER : అనగనగా ఒక రాజు ట్రైలర్.. గోదారి ఎటకారంతో

Anaganaga Oka Raju TRAILER :  అనగనగా ఒక రాజు ట్రైలర్.. గోదారి ఎటకారంతో
X

అనగనగా ఒక రాజు మూవీ ట్రైలర్ వచ్చేసింది. చెప్పినట్టుగా ఒక రోజు ఆలస్యంగా విడుదల చేశారు. అందుకు నాగార్జున వాయిస్ ఓవర్ వల్ల కాస్త ఆలస్యం అయిందనుకోవచ్చు. బట్ ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. కంప్లీట్ గా సంక్రాంతి ఎంటర్టైనర్ అనిపించేలా ఉంది. ఈ పండగకు పర్ఫెక్ట్ మూవీలా ఉంది. ట్రైలర్ ఆసాంతం గోదావరి ఎటకారంతో నిండిపోయింది. ఇదేం కొత్తదనం కాకపోయినా.. అందులోని ఎటకారం కాబట్టే కదా ఆకట్టుకునేది. అందుకే చాలా చాలా బావుంది ట్రైలర్.

నాగార్జున వాయిస్ ఓవర్ తో ప్రారంభమైంది. దీంతో పాటు నవీన్ పోలిశెట్టి ఎనర్జీ, టైమింగ్ చాలా ప్లస్ అయింది. చాలామంది కమెడియన్స్ ఉన్నా.. నవీన్ మాత్రం ఒన్ మేన్ షోలా నడిపించేసినట్టు కనిపిస్తోంది. ఇక మీనాక్షి చౌదరికి ఇదో ఫ్రెష్ గా ఉన్న మూవీలా కనిపిస్తోంది. తన టైమింగ్ యాక్టింగ్ సెట్ అయింది. ఇద్దరి కెమిస్ట్రీ చాలా బావుంది. ఇద్దరి మధ్య సన్నివేశాలు హిలేరియస్ గా వర్కవుట్ అయినట్టు ట్రైలర్ తోనే అర్థం అవుతోంది.

‘పంతులుగారు ఎన్నిసార్లు చెప్పానండీ హుండీ కన్నం పెద్దది చేయదు.. నాక్కాబోయే మామగారి ఎఫెక్షన్ మాత్రం డివైడ్ అవుతంది.. అనే డైలాగ్ కు ఎఫెక్షన్ అంటే ఆస్తులు అని చెప్పడం. మీ కుక్క బ్రాండ్ ఏంటీ అని అడగడం.. దానికి ‘బ్లాక్ డాగ్’అనడం.. అమెరికా వెళ్లే ప్లాన్ ఉందంటే.. చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగా.. వైట్ హౌస్ అనడం.. అంతా బావున్నట్టుగా ఉంది. అలాగే యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. ప్రశాంతంగా ఉన్నవాడ్ని ప్రశాంత్ నీల్ లా తెచ్చేలా ఉండటం బావుంది. ఎలా చూసినా ఆసాంతం ఆకట్టుకునే ట్రైలర్ లా కనిపిస్తోంది.

నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. మారి దర్శకత్వం చేశాడు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మరి మిగతా పాత్రలు చాలానే ఉన్నా.. అందరినీ నవీన్ పోలిశెట్టి డామినేట్ చేసేలా కనిపిస్తున్నాడు. మొత్తంగా ఈ మూవీ ఈ నెల 14న విడుదల కాబోతోంది.

Tags

Next Story