Anand Devarakonda: 'బేబీ' కోసం వినూత్న ప్రమోషన్స్

Anand Devarakonda: బేబీ కోసం వినూత్న ప్రమోషన్స్

దొరసాని సినిమాతో సినీ కేరీర్ ను ప్రారంభించిన ఆనంద్ దేవరకొండ ఇప్పుడు బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జూలై 14న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి వినూత్నంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఆటోలతో రిలీజ్ డేట్ ను ప్రకటించిన ప్రమోషన్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ ఆటో డ్రైవర్ గా కనిపించనున్నాడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మించగా సాయి రాజేష్ దర్మకత్వం వహించాడు.





ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రను పోషించారు. ఇప్పటికే బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలిస్తున్నాయి.






వందల ఆటోలు ఒకేసారి సినిమా రిలీజ్ డేట్‌ను మరోసారి ప్రకటించాయి. జూలై 14న బేబీ విడుదల కాబోతోందంటూ వరుస క్రమంలో ఆటోలను పెట్టి వినూత్నంగా ప్రమోషన్స్ చేయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిత్రాన్ని చూసిన సినీ ప్రముఖులు టీంను అభినందిస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా విజయాన్ని అందుకుంటుదని ధీమా వ్యక్తం చేశారు.


Tags

Read MoreRead Less
Next Story