Anand Devarakonda: బేబీ విశేషాలు ఇవే.. జూలై 14న రిలీజ్

Anand Devarakonda:  బేబీ విశేషాలు ఇవే.. జూలై 14న రిలీజ్
X


ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యలు కలిసి నటించిన మూవీ బేబీ. కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ అనే సినిమా రాబోతోంది. ఇక ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. జూలై 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర నిర్మాత ఎస్‌కేఎన్ తన పుట్టిన రోజు సందర్భంగా బేబీ విశేషాలను పంచుకున్నారు.

"గత ఐదేళ్ల నుంచి రివర్స్ లెక్కపెడుతున్నా.. నాకు పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం పెద్దగా ఇష్టం ఉండదు. ఈసారి బేబీ మూవీ ఉండడంతో ప్రత్యేకమైంది. ఈ సినిమా హై ఇంటెన్స్ ఎమోషనల్ ప్రేమ కథ. సంగీతం కూడా చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి చిత్రాలలో బెస్ట్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. సీన్స్, డైలాగ్స్ చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి ఒక్కరు.. ప్రతి ప్రెస్‌మీట్‌లో కొత్తదనం అనే పదం వాడి చాలా పాతది చేశారు. కానీ నేను గర్వంగా చెబుతున్నా. ఈ సినిమాలో ఇది వరకు చూడని సీన్లు.. చూడని పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం నచ్చింది. ఆ విధానం నచ్చే నేను ట్యాక్సీవాలా తరువాత కొంత గ్యాప్‌ తీసుకుని ఈ సినిమానే చేయాలని అనుకున్నా. ఇది వరకు నేను కాంబినేషన్‌లో చాలా సినిమాలు చేశా గానీ.. ఈ సినిమాను సోలో నిర్మాతగా చేయాలని ఫిక్స్ అయ్యా. ముగ్గురు మధ్య జరిగే సీన్లలో కొత్త అప్రోచ్ ఉంటుంది. ఇంటర్వెల్ ముందు పెద్ద షాక్ ఉంటుంది. ఈ షాక్ నచ్చే సినిమాను నేను చేయాలని ఫిక్స్ అయ్యా. విజయ్ దేవరకొండతో ట్యాక్సీవాలా చేస్తున్నప్పుడే సాయి రాజేష్ కథ చెప్పాడు. అప్పుడే నా తరువాతి సినిమా ఇదే అని చెప్పా". అని అన్నారు.

"కరోనాతో రెండేళ్లు సినిమాలు ఎవరు తీయకపోవడంతో గ్యాప్ వచ్చింది. ఒకటిన్నర సంవత్సరం మేకింగ్‌లో ఉంది. డైరెక్టర్ మారుతి కూడా ఈ సినిమాలో ఓ పార్ట్‌నర్. నేను, బన్నీ వాసు, మారుతి, యూవీ క్రియేషన్స్ వంశీ సినిమాల్లోకి రాకముందు నుంచి ఫ్రెండ్స్. డిస్టిబ్యూషన్ చేసే వాళ్లం. మిర్చితో వంశీ ప్రొడ్యూసర్ అయ్యాడు. 100% సినిమాతో వాసు, ఆ తరువాత మారుతి డైరెక్టర్ అయ్యాడు. మేం అందరం కథలు వింటాం. ఈ సినిమా స్టోరీ అందరికీ బాగా నచ్చింది" అని చెప్పారు. జూలై 14న సినిమా రిలీజ్ కానుంది.

Tags

Next Story