Anand Deverakonda : ఎపిక్ మూవీతో వస్తోన్న ఆనంద్ దేవరకొండ

ఆనంద్ దేవరకొండ ఈ మధ్య మూవీస్ తగ్గించుకున్నాడు. వైవిధ్యమైన కథల కోసం చూస్తున్నాడు అని చాలామంది భావించారు. అది నిజమే అనిపించేలా ఉన్నాడు ‘ఎపిక్’ మూవీతో వస్తున్నాడు. బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. ఆదిత్య హాసన్ దర్శకత్వం చేస్తున్నాడు. అతను 90స్ మూవీతో ఆకట్టుకున్నాడు. తర్వాత లిటిల్ హార్ట్స్ నిర్మాతగానూ ఆకట్టుకున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తో నిర్మిస్తుంది ఈ ఎపిక్ చిత్రం. ఫస్ట్ సెమిస్టర్ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు.
వీరు ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేస్తూ ఈ మూవీ నుంచి ఒక వీడియో వదిలారు. ఆ వీడియో ఆకట్టుకునేలా ఉంది. ఇందులో లండన్ లో జరిగే కథ ఇదీ అనిపించారు. ఆ వీడియోలో చూస్తే.. మాస్టర్స్ అయిపోయింది. తెలుగు ఆచారం ప్రకారం.. పెళ్లా నెక్ట్స్ అని ఓ అమ్మాయి అడుగుతుంది. అందుకు వైష్ణవి చెబుతుంది.. ఒన్ మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బ్యూటీఫుల్ మ్యూజిక్ టేస్ట్ ఉండాలి.. అకాడమికల్లీ ఇంటెలిజెంట్ అయి ఉండాలి .. అంటుంది. అందుకు మరో అమ్మాయి యా దొరుకుతాడు అంటుంది. కట్ చేస్తే.. గద్దర్ గెటప్ తో కనిపిస్తూ వస్తుంటాడు ఆనంద్ దేవరకొండ.. దాని వెనక అంగీలేనిపై ఒంటిపై గొంగడేసుకుండు.. అడ్డ పంచెను బుడ్డ గోసిటపెట్టిండు అంటూ గోరేటి వెంకన్న పాటతో కనిపిస్తాడు. అతన్ని చూసిన వైష్ణవి.. ‘దొరికేశాడు’ అని చెబుతుంది. దీనికి ఆనంద్ వాయిస్ వినిపిస్తుంది.. ఇది ‘శేఖర్ కమ్ములాలాంటి హీరో అబ్బాయికి, సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరోలాంటి అమ్మాయి దొరికే కథ’అని చెబుతాడు. దాని వెనక సంచారమే ఎంత బాగుంటది అనిపించే పాట కూడా వినిపిస్తుంది.
మొత్తంగా ఎపిక్ : ఫస్ట్ సెమిస్టర్ అనే టైటిల్ బావుంది. బాగా ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది అనిపిస్తోంది. ఆదిత్య హాసన్ ఫస్ట్ మూవీ 90స్ తో బాగా మెప్పించాడు. సెకండ్ మూవీతో కూడా బాగా ఆకట్టుకుంటాడు అనిపించేలా ఉన్నాడు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

