Anand Mahindra: 'ప్రాజెక్ట్ కె'కు ఆనంద్ మహీంద్ర సపోర్ట్.. నాగ్ అశ్విన్ ట్వీట్‌కు రిప్లైగా..

Anand Mahindra: ప్రభాస్ ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా సినిమాల్లోనే నటిస్తున్నాడు. అలా కాకుండా కేవలం పాన్ ఇండియా సినిమాలు చేయాలనుకుంటున్న దర్శకులందరూ ప్రభాస్ వెంటపడుతున్నారు. అయితే పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రభాస్‌తో సినిమాను ప్లాన్ చేశాడు నాగ్ అశ్విన్. అయితే ఈ సినిమా కోసం ఇటీవల ఆనంద్ మహీంద్రను ట్యాగ్ చేస్తూ నాగ్ అశ్విన్ ఓ ట్వీట్ పెట్టగా దానికి ఆనంద్ మహీంద్ర స్పందించారు.
ప్రభాస్‌తో చేస్తున్న 'ప్రాజెక్ట్ కె' కోసం నాగ్ అశ్విన్ భారీగానే ప్లాన్ చేశాడు. ఇప్పటివరకు తెలుగులోనే కాదు.. మొత్తం భారతీయ సినిమాల్లోనే ఉపయోగించని అధునాతన టెక్నాలజీని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నాడు. అందుకే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసమే చాలా సమయం తీసుకుంది మూవీ టీమ్. తాజాగా ప్రాజెక్ట్ కె సెట్స్‌పైకి వెళ్లింది.
అయితే ప్రాజెక్ట్ కెలో నాగ్ అశ్విన్ అండ్ టీమ్ ఉపయోగిస్తున్న వాహనాలు చాలా అధునాతనమైనవని, తమ దగ్గర పనిచేసే వారంతా యంగ్ ఇండియన్ ఇంజనీర్లు అని పేర్కొన్నాడు నాగ్ అశ్విన్. అంతే కాకుండా ఈ ఇంజనీర్ల విషయంలో తమకు సాయం చేయాలంటూ ఆనంద్ మహీంద్రను ట్విటర్ ట్యాగ్ చేస్తూ కోరాడు నాగ్ అశ్విన్. దీనికి ఆనంద్ మహీంద్ర దగ్గర నుండి కూడా త్వరగానే స్పందన లభించింది.
'భవిష్యత్తును చూడాలనుకునే మీ ప్రయత్నంలో సహాయపడే అవకాశాన్ని మేము ఎందుకు వదులుకుంటాం. గ్లోబల్ ప్రొడెక్ట్ డెవలప్ మెంట్ చీఫ్ వేలు మహీంద్ర సంతోషంగా మీ వెంట ఉండి కచ్చితంగా సహాయం అందిస్తారు. ఎక్స్ యూవీ 700 కారును తయారు చేసిన వేలు ఇప్పటికీ భవిష్యత్తులో కాలు పెట్టేశాడు' అంటూ ప్రాజెక్ట్ కె సినిమాకు సాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు ఆనంద్ మహీంద్ర.
How could we refuse an opportunity to help you envision the future of mobility @nagashwin7 ? Our Chief of Global Product Development @Velu_Mahindra will, I'm sure, happily throw his weight behind you. Velu developed the @xuv700 & already has his feet in the future! https://t.co/4DDuOULWZD
— anand mahindra (@anandmahindra) March 4, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com