KGF 2: 'కేజీఎఫ్ 2'లో ఆ ప్రముఖ నటుడు ఎందుకు లేడు? రూమర్స్‌కు చెక్ పెట్టిన డైరెక్టర్..

Ananth Nag in KGF (tv5news.in)

Ananth Nag in KGF (tv5news.in)

KGF 2: కేజీఎఫ్ చాప్టర్ 2లో అనంత్ నాగ్ లేకపోడంపై ప్రశాంత్ నీల్ స్పందించారు.

KGF 2: యశ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కేజీఎఫ్ 2' ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే కేవలం కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోని మూవీ లవర్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తు్న్నారు. అయితే కేజీఎఫ్ చాప్టర్ 1లో కీలక పాత్ర పోషించిన అనంత్ నాగ్.. కేజీఎఫ్ 2లో లేకపోవడం వల్ల చాలామంది ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. ఆయన ప్లేస్‌లోనే ప్రకాశ్ రాజ్ వచ్చారు అనే వార్తలపై ఇటీవల దర్శకుడు ప్రశాంత్ నీల్ స్పందించాడు.

కేజీఎఫ్ చాప్టర్ 1 విజయంలో ముఖ్య పాత్ర పోషించాయి ఎలివేషన్స్. ఆ ఎలివేషన్ సీన్స్‌లో యశ్ నటన ప్రశంసనీయంగా ఉన్నా.. ఎలివేషన్స్‌ను ఇచ్చే పాత్రలో నటించిన అనంత్ నాగ్‌కు కూడా చాలా క్రెడిట్ దక్కుతుంది. కన్నడ సినీ పరిశ్రమలోని సీనియర్ నటులలో ఒకరైన అనంత్ నాగ్.. కేజీఎఫ్ 1కు వెన్నుముకగా నిలిచారు. కానీ కేజీఎఫ్ చాప్టర్ 2లో ఆయన స్థానంలో ప్రకాశ్ రాజ్ కనిపించారు.


కేజీఎఫ్ చాప్టర్ 2లో అనంత్ నాగ్ లేకపోడంపై ప్రశాంత్ నీల్ స్పందించారు. ఈ సినిమాలో అనంత్ నాగ్ లేకపోవడం కేవలం ఆయన నిర్ణయమే అన్నారు ప్రశాంత్ నీల్. అంత పెద్ద నటుడిని ఎందుకు మా సినిమాలో చేయరు అని ప్రశ్నించడం కరెక్ట్ కాదు కాబట్టి మేము కూడా ఆయన నిర్ణయాన్ని గౌరవించాం అన్నారు. ప్రకాశ్ రాజ్ పాత్రకు, అనంత్ నాగ్ పాత్రకు సంబంధం ఉండదని, రెండు వేర్వేరు అని, అది సినిమా చూశాకే అర్థమవుతుందని స్పష్టం చేశాడు ప్రశాంత్ నీల్.

Tags

Next Story