Ananth Sriram : పరిపూర్ణపై అనంత శ్రీరామ్ ప్రేమ.. బాలయ్య ఫ్యాన్స్ గరం

ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ మాటలు పొలిటికల్ గా రచ్చ చేస్తున్నాయి. అప్పుడప్పుడూ కొన్ని పొలిటికల్ సెటైర్లతో కవ్వించడం అనంత శ్రీరామ్‌కు అలవాటే. తాజాగా ఆయన చేసిన కామెంట్ నందమూరి బాలకృష్ణ అభిమానులకు కోపం తెప్పిస్తోంది.
"హిందూపురం ప్రజలకు పరిపూర్ణానందం కలగాలని కోరుకుంటున్నా" అంటూ ఫేస్ బుక్‌లో ఆయన ఓ పోస్ట్ చేశారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. హిందూపురంలో టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామి పోటీ చేస్తున్నారు.
పరిపూర్ణానంద స్వామికి మద్దతు తెలుపుతున్నట్టుగా అనంత శ్రీరామ్ కామెంట్ ఉండటంతో బాలయ్య ఫ్యాన్స్ గరం అవుతున్నారు. 'ఇది నీకెందుకొచ్చిన గొడవ' అంటూ శ్రీరామ్‌ని మందలిస్తున్నారు అభిమానులు. హిందూపురంలో బాలయ్య గెలవడం పక్కా అని కామెంట్లు పెడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com