Ananya Panday : చట్టాలను మార్చాల్సిన టైమ్ వచ్చింది : అనన్యపాండే
మాలీవుడ్ ను హేమకమిటీ రిపోర్ట్ షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ 2019 నాటి రిపోర్టు బయటపెట్టాలని హీరోయిన్ సమంత సైతం స్పందించారు. ఇదే తరుణంలో బాలీవుడ్ నటి అనన్యపాండే సైతం ఇదే ఇష్యూపై స్పందించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. గతంతో పోలిస్తే ఇప్పుడు నటీమణులు వారి సమస్యలను ధైర్యంగా చెప్పగలుగుతున్నారని అన్నారు. సమాజంలో జరుగుతున్న ప్రతీ విషయం గురించి మహిళలకు అవగాహన ఉండాలన్నారు. ప్రస్తుతం చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, ఇది మహిళలకు చీకటి కాలమని చెప్పారు. ఈ దాడులను ఆపడం కోసం ఏం చేయాలో ఆలోచించాలన్నారు. మన చుట్టూ ఉండే పరిసరాలను గమనించుకుంటూ ప్రతి వ్యక్తిపైనా అవగాహన కలిగిఉండాలని అభిప్రాయపడ్డారు. తాను ఇలాంటి పరిస్థితులపై ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉంటానని అన్నారు. వాస్తవానికి చట్టాలను మార్చాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాని అన్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో అనన్య 'లైగర్' గురించి ప్రస్తావించారు. సినిమాల్లోని సన్నివేశాలపై హీరోయిన్లు ధైర్యంగా వారి అభిప్రాయాన్ని తెలపాలని అనన్య అన్నారు. 'లైగర్' స్క్రిప్ట్ చదివిన తర్వాత కొన్ని మార్పులు చెప్పానని తెలిపారు. మరికొన్ని సన్నివేశాలు మార్చాలని సూచించానని అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com