Ananya Panday : రొమాంటింక్ సినిమాలు చేయాలని ఉంది : అనన్య పాండే

Ananya Panday : రొమాంటింక్ సినిమాలు చేయాలని ఉంది : అనన్య పాండే
X

‘లైగర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. తాజాగా ఆమె నటించిన ‘కంట్రోల్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విహాన్ హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు విక్రమాదిత్య మొత్వానే తెరకెక్కించగా నెట్‌ఫ్లిక్స్ లో విడుదల అయ్యింది. ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఆడియన్స్ నుండి కూడా మంచి టాక్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర కామెంట్స్ చేసింది అనన్య పాండే. దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాల్లో నటించాలనేది నా కోరిక. నాకు రొమాంటిక్, హారర్, బయోపిక్‌ జానర్స్ లో నటించాలని ఉంది. అలాగే కరణ్ జోహర్ తో సినిమా చేయాలని ఉంది. అంటూ చెప్పుకోచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Next Story