Ananya : సీన్ నచ్చకపోతే మార్చమని చెప్తా..అనన్య పాండే ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ananya : సీన్ నచ్చకపోతే మార్చమని చెప్తా..అనన్య పాండే ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

మహిళలపై జరుగుతున్న అఘాత్యాలకు సంబంధించి బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోయిన్లు, మహిళా యాక్టర్స్ వారి సమస్యలను ధైర్యంగా చెప్తున్నారని తెలిపింది.‘సమాజంలో జరుగుతున్న ప్రతీ విషయం గురించి మహిళలకు అవగాహన ఉండాలి. ప్రస్తుతం చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఇది మహిళలకు చీకటి కాలం. ఈ దాడులను ఆపడం కోసం ఏం చేయాలో ఆలోచించాలి. మన చుట్టూ ఉండే పరిసరాలను గమనించుకుంటూ ప్రతి వ్యక్తిపైనా అవగాహన కలిగిఉండాలి. చట్టాలను మార్చాల్సిన సమయం వచ్చింది. ఇది చాలా అవసరమైన నిర్ణయం. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా.సినిమాల్లోని సీన్లపై హీరోయిన్లు ధైర్యంగా వారి ఓపినియన్ ను చెప్పాలి. నాకు ఏదైనా స్క్రిప్ట్‌ చెప్పినప్పుడు అది బాగా లేదనిపిస్తే.. వెంటనే రెస్పాండ్ అవుతా. లైగర్‌ మూవీ స్క్రిప్ట్ ‌ చదివిన తర్వాత కొన్ని మార్పులు చెప్పాను. మరికొన్ని సీన్లు మార్చాలన్నాను. మూవీ టీమ్ అందుకు ఒప్పుకుంది. ఇలా అందరూ చెప్పగలగాలి’ అని అనన్య చెప్పుకొచ్చింది.

Tags

Next Story