Anasuya : హీరోయిన్ రాశీకి క్షమాపణలు చెప్పిన అనసూయ

Anasuya :  హీరోయిన్ రాశీకి క్షమాపణలు చెప్పిన అనసూయ
X

సీనియర్ హీరోయిన్ రాశీకి అనసూయ క్షమాపణలు చెప్పింది. కొన్ని రోజులుగా జరుగుతోన్న సోషల్ మీడియాలో వ్యవహారాల విషయంలో అనసూయ ఓ రేంజ్ లో ఫైర్ అవుతోంది. తన వస్త్రధారణ గురించి చేసిన కొన్ని కమెంట్స్ పై తీవ్రంగా స్పందించింది. ఇన్ డైరెక్ట్ గా శివాజీ పైనే ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పాటు హీరోయిన్ రాశి తాజాగా కొన్ని విషయాలు స్పందించింది. తనకు జబర్దస్త్ షోలో అవమానించే విధంగా మాట్లాడ్డం, దానికి అనసూయకు కూడా పాజిటివ్ గా స్పందించడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది.

‘డియర్ రాశి గారు, మై సిన్సియర్ అపాలజీస్ టూ యూ.. మూడు సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్ లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది.కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే. ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్..’ అంటూ అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరి దీనికి రాశి ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో కానీ.. ఈ విషయం పట్ల కూడా అనసూయ నుంచి సోషల్ మీడియాలో మిక్స్ డ్ టాక్ వస్తోంది. దీంతో పాటు ఆ రోజు మాట్లాడిన దాన్ని ఇవాళ్టి అంశాలను గురించి కూడా ఉటంకించిన అనసూయ పోస్ట్ మాత్రం వైరల్ అయిందిపుడు.

Tags

Next Story