మరోసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అనసూయ..!

మరోసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అనసూయ..!
Anasuya Bharadwaj: జబర్దస్త్ కామెడీ షోతో మచి పాపులారిటిని సంపాదించింది అనసూయ భరద్వాజ్. తన అందచందాలతో కొద్దికాలంలోనే తెలుగులో టాప్ యాంకర్ గా మారిపాయింది ఈ భామ.

Anasuya Bharadwaj: జబర్దస్త్ కామెడీ షోతో మచి పాపులారిటిని సంపాదించింది అనసూయ భరద్వాజ్. తన అందచందాలతో కొద్దికాలంలోనే తెలుగులో టాప్ యాంకర్ గా మారిపాయింది ఈ భామ. యాంకర్స్‌కు స్టార్ ఇమేజ్ రావడం అరుదుగానే జరుగుతుంది. అలా తెలుగులో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న కొద్దిమంది యాంకర్స్ లో ఒకరు అనసూయ. అటు యాంకర్ గా బిజీ గా ఉంటూనే ఇటు సినిమాల్లో కూడా నటిస్తుంది ఈ భామ.

సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో చిన్న పాత్రతో నటించి మెప్పించిన అను.. వరుస సినిమాలతో బిజీగా మారిపాయింది. అడివి శేషు హీరోగా వచ్చిన "క్షణం" సినిమాలో అనసూయ చేసిన పాత్రకు మంచి గుర్తింపు లబించింది. ఆతరువాత సుకుమార్ దర్శకత్వం వచ్చిన సూపర్ హిట్ సినిమా రంగస్థలంలో రంగమ్మత్త అనే క్యారక్టర్ చేసిని అనసూయ తన నటనతో ఇండస్ట్రీ లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

ఈ మధ్యే "థ్యాంక్ యూ బ్రదర్" సినిమాతో వచ్చిన అను.. మరో రెండు సినిమాల్లో నటిస్తుంది. ఈ సమయంలోనే "పుష్ప" సినిమాలో నటించే అవకాశం వచ్చిందట ఈ భామకి. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో ప్యాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాలో అనసూయని తీస్కున్నారట చిత్ర యూనిట్.

అనసూయ ఈ మూవీలో సునీల్ కి భార్యగా నటిస్తుందట. ఈ పాత్రకి తక్కువ సీన్సే ఉన్నా చాలా ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టరట అనసూయది. ఆమె పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయని ప్రచారం జరుగుతుంది. అనసూయ, సునీల్ పాత్రలు సినిమాకు కీలకంగా మారనున్నాయట. నిజానికి ముందు ఈ సినిమాలో అనసూయ పాత్ర లేదు కానీ రంగస్థలం లో రంగమ్మత్త క్యారెక్టర్ కి వచ్జిన హైప్ ని చూసి కావలనే ఈ మూవీలో తీస్కున్నాడట సుకుమార్. ఈ మూవీ పూర్తిగా రాయలసీమ యాసలోనే సాగాబోతుందట. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.


Tags

Read MoreRead Less
Next Story