Anasuya Bharadwaj: ఏడవలేక నవ్వుతున్నా.. అలా ఎందుకు చేశారు..: ఫీలవుతున్న అనసూయ

Anasuya Bharadwaj: అందాల తార అనసూయకు సోగ్గాడే చిన్ని నాయనలో ఛాన్స్ ఇచ్చారు.. మరి బంగార్రాజులో ఎందుకివ్వలేదు.. అదే ఆమెకి అర్థం కాలేదు.. అందుకే అందరి ముందు అదే విషయాన్ని అడేగిసింది దర్శకుడు కళ్యాణ కృష్ణని.. గురువారం బంగార్రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనసూయ భరద్వాజ్ సందడి చేసింది. బంగార్రాజు సినిమాతో అనసూయకి ఎలాంటి సంబంధం లేదు. అయినా ఆమె ఈవెంట్‌కి వచ్చింది. ఇందులో అనసూయ ఎలాంటి పాత్ర చేయలేదు.
బంగార్రాజు సినిమాలో తనకు ఎందుకు పాత్ర ఇవ్వలేదు.. తనను వేదికపైకి ఎందుకు ఎక్కించలేదు అని అనసూయ చాలా ఫీలైంది. దానికి ఆయన చెప్పిన కారణం అప్పుడు ఇప్పుడు కూడా ఒకటే.. పిన్ని క్యారెక్టర్ ఉంటుంది.. వయసు ఎక్కువగా చూపించాల్సి ఉంటుంది.. అలాంటి పాత్ర చేస్తారా అని అడిగితే చేయనని చెప్పారు.. అయినా పాత క్యారెక్టర్ ఎందుకు మీకు.. మీ కోసం బుజ్జి అని ఓ వెబ్ సిరీస్‌ని ప్లాన్ చేసాను అని అన్నారు కళ్యాణ్ కృష్ణ. దానికి ఇంత పెద్ద బిస్కెట్ ఎవరైనా వేస్తారా అని అనసూయ అరిచింది. నన్ను ఈ సినిమాలో ఎందుకు చేర్చలేదని మీరు కనిపించిన ప్రతిసారీ అడుగుతూనే ఉంటాను అని దర్శకుడిని సరదాగా టీజ్ చేసింది అనసూయ.
ఇక బంగార్రాజు సినిమాపై అనసూయ పాజిటివ్ కామెంట్స్ చేసింది. సినిమా ట్రైలర్ నాలుగైదు సార్లు చూశాను. నాగ్ సర్, నాగచైతన్య ఇద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపించి ఫ్యాన్స్‌కి ఆనందాన్ని పంచారు. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను అని అనసూయ చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com