Anasuya Bharadwaj: 'మర్యాద ఇస్తే.. మర్యాద దక్కుతుంది..' జర్నలిస్ట్‌పై అనసూయ ఫైర్

Anasuya Bharadwaj (tv5news.in)
Anasuya Bharadwaj: తెలుగు స్క్రీన్‌పై కాంట్రవర్సీలకు ఏ మాత్రం తగ్గని అనసూయ భరద్వాజ్.. ఎవరైన తన గురించి నచ్చనట్టు మాట్లాడినా.. వెంటనే వారికి ఘాటుగా రిప్లై ఇచ్చేస్తుంది. అందుకే తన చుట్టూ ఎప్పుడూ కాంట్రవర్సీలు తిరుగుతూనే ఉంటాయి. తాజాగా తన వయసును తప్పుగా రాసినందుకు ఓ జర్నలిస్ట్‌పై ఫైర్ అయ్యింది అనసూయ.
అనసూయ వయసు 36 కానీ.. చూడడానికి మాత్రం అస్సలు అలా ఉండదు. తను బుల్లితెరపై కనిపిస్తే చాలు.. అస్సలు మిస్ అవ్వకుండా చూసే అభిమానులను సంపాదించుకుంది అనసూయ. హోస్ట్‌గానే కాదు.. నటిగా కూడా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. అయితే తాజాగా తాను ఓ న్యూస్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన న్యూస్‌పై ఫైర్ అవుతూ ఓ ట్వీట్ చేసింది.
Hello Satvika(the journalist of this article)I am not 40+..I am 36..age ascending is inevitable & I never shy away to that fact..(but I promise to look good & age gracefully)But journalists like you should consider your profession with Honesty & Ethics..its high time..Goodluck 😊 https://t.co/tJFZ0G1gVk
— Anasuya Bharadwaj (@anusuyakhasba) February 18, 2022
తన గురించి రాసిన ఆర్టికల్‌ను ట్విటర్‌లో షేర్ చేసింది అనసూయ. తన వయసు 40 కాదు 36 అని స్పష్టం చేసింది. కానీ తాను ఎప్పుడూ అందంగా కనిపించడానికే ప్రయత్నిస్తానని చెప్పింది. అంతే కాకుండా దీని ఉద్ద్యేశించి మరికొన్ని ట్వీట్లు చేసింది అనసూయ. 'మీరు ముందు పెట్టిన మంచి విషయాలకు, చెడు విషయాలకు అన్నింటికి నా థాంక్యూ. మంచి ఉద్ద్యేశంతో ఎవరి పని వారు చేస్తే బాగుంటుంది. ఎదగడానికి విమర్శించాలి. తక్కువ చేయడానికి కాదు' అని ట్వీట్ చేసింది అనసూయ.
Also! Thank you for all the nice things and not so nice things you put forth! But we would be in a better place to live in if we do our jobs and responsibilities with good intentions.. criticise to better/encourage .. not to curb down.. 😌
— Anasuya Bharadwaj (@anusuyakhasba) February 18, 2022
'రాసేటప్పుడు కాస్త మంచి పదాలు ఉపయోగించండి. అలా అయితే మిమ్మల్ని కూడా గౌరవంతో చూస్తారు. అదే ఇచ్చిపుచ్చుకునే పద్ధతి అంటే. ఈరోజుల్లో దాన్నే కొంతమంది పట్టించుకోకుండా వదిలేస్తున్నారు.' అని వరుస ట్వీట్లతో తన ఆగ్రహాన్ని బయటపెట్టింది అనసూయ భరద్వాజ్.
Use decent terminology in the description.. that way.. you would be considered with respect too.. its give and take you know.. that's what one takes for granted these days.. Journalism is a very powerful weapon.. handle it right before it backfires at you.. 🙂
— Anasuya Bharadwaj (@anusuyakhasba) February 18, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com