Anasuya Bharadwaj : తప్పుడు వార్తలపై అనసూయ ఫైర్..

anasuya bharadwaj (tv5news.in)
Anasuya Bharadwaj : మా ఎన్నికల నేపధ్యంలో ఆర్టిస్టుల మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. అందులో నిజాలు ఏవో, అబద్ధాలు ఏవో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో మా ఎన్నికలపై విచ్చలవిడిగా వార్తలు వచ్చాయి. అయితే అలాంటి తప్పుడు వార్తల వల్ల అనసూయ.. తాను కూడా బాధితురాలు అయ్యానని చెప్పుకొచ్చింది.
మా ఎన్నికల తర్వాత ప్రకాశ్ రాజ్ మా కు పోటీగా మరో అసోసియేషన్ ప్రారంభించనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ప్రకాశ్ రాజ్ తన ప్యానల్‌తో కలిసి దానిపై క్లారిటీ ఇచ్చారు. అందులో అనసూయ భరద్వాజ్ కూడా ఉంది. ఎన్నికలు ముగిసిన తర్వాత మొదటిసారి తనపై వస్తున్న తప్పుడు వార్తలపై నోరువిప్పింది అనసూయ. తన ప్రమేయం లేకుండా తప్పుడు వార్తలకు తన పేరును ఆపాదిస్తే కోర్టుకు వెళ్తానని హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com