Anasuya Bharadwaj: ఒకే రకమైన పాత్ర.. రెండు భాషల్లో సినిమాలు..

Anasuya Bharadwaj (tv5news.in)

Anasuya Bharadwaj (tv5news.in)

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్.. ఇప్పటికే బుల్లితెరపై తానేంటో నిరూపించుకుంది.

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్.. ఇప్పటికే బుల్లితెరపై తానేంటో నిరూపించుకుంది. అందుకేనేమో ఇప్పుడు బుల్లితెరపై తక్కువగా, వెండితెరపై ఎక్కువగా కనిపించడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు నటిగా తాను చేసింది తక్కువ సినిమాలే అయినా.. అందులో తన నటన మాత్రం అందరినీ ఆకట్టుకుంది. తాజాగా మాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది అనసూయ.

టాలీవుడ్‌లో చేసింది తక్కువ సినిమాలే. కానీ ప్రతీ సినిమాలో ఇంపాక్ట్ క్రియేట్ చేసే పాత్రల్లో మాత్రమే కనిపించింది అనసూయ. ఇక్కడ ఇప్పటికే నటిగా ప్రూవ్ చేసుకున్న అనూ.. త్వరలోనే మాలీవుడ్ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే మలయాళంలోనే తన మొదటి సినిమాలోని ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ.

మమ్ముట్టి హీరోగా నటించిన 'యాత్ర' సినిమాలో అనసూయ ఓ చిన్న రోల్‌లో కనిపించింది. అయితే ఆ సినిమాలో అనసూయ యాక్టింగ్‌కు ఇంప్రెస్ అయిన మమ్ముట్టి.. తన తరువాతి చిత్రం 'భీష్మ పర్వం'లో అచ్చం అలాంటి ఓ క్యారెక్టర్‌నే తనకు ఆఫర్ చేశాడు. దానికి అనసూయ కూడా వెంటనే ఓకే చెప్పేసింది. ఇందులో తాను ఆలీస్ అనే పాత్రలో కనిపించనుంది. అయితే ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే యాత్ర సినిమాలో చరిత పాత్రకు, భీష్మ పర్వంలో ఆలీస్ పాత్రకు దగ్గర పోలికలు ఉన్నట్టు తెలుస్తోంది.


Tags

Read MoreRead Less
Next Story