Anasuya Bharadwaj: ఆయన దిగజారి మాట్లాడారంటూ కోటకు పరోక్షంగా కౌంటరిచ్చిన అనసూయ

Anasuya twitter (tv5news.in)
Anasuya Bharadwaj: అనసూయ మాట మృదువుగా ఉంటుంది కాని.. అందులో ఘాటు మాత్రం గూబ గుయ్యిమనిపిస్తుంది. ఇప్పుడు కూడా తనపై వచ్చిన కామెంట్స్ కు అంతే స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చింది. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అనసూయపై ఓ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశారు. అనసూయ యాక్టింగ్ బాగుంటుంది కాని.. ఆమె డ్రస్ సెన్స్ నచ్చదన్నారు. ఈ మాట కాస్తా వైరల్ అయ్యింది.
నేరుగా కోట శ్రీనివాసరావు మాటలకు రెస్పాండ్ కాకపోయినా.. పరోక్షంగా మాత్రం పెద్దాయన అంటూనే అడగాల్సినవన్నీ కడిగేసింది. పెద్దరికం, చిన్నరికం అనేవి వయసుతో కాదండి.. అనుభవంతో వస్తాయని స్ట్రోక్ ఇచ్చింది. ఆయన నటనంటే ఇష్టమంటూనే.. ఆయన కామెంట్స్ మాత్రం అనవసరమైనవని, చాలా తక్కువస్థాయిలో మాట్లాడారని రిప్లయ్ ఇచ్చింది.
తనను చిన్నోళ్లు, పెద్దోళ్లు ఏది పడితే అది అనొచ్చని, అదే తాను ఒక్క మాట జవాబిస్తే మాత్రం... పాపం ముసలాయన, పాపం పెద్దాయన, పాపం చిన్నవాడు, పాపం ఏదో తెలియక, సీన్ చేయకండి లాంటి రియాక్షన్స్ ఇస్తారని.. ఇదెంత అన్యాయమండి అని దుమ్ము దులిపేసింది. వేసుకునే డ్రస్ ని బట్టి కాదని.. ఆలోచన తీరులో మార్పు ఉండాలని చెప్పుకొచ్చింది అనసూయ.
అప్పుడైనా, ఇప్పుడైనా మహిళలు ఎలాంటి బట్టలు ధరించాలో, ఎలా ఉండాలో చెప్పేవాళ్లు.. ముందు వాళ్ల చెడు ఆలోచనలను కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పింది అనసూయ. మహిళలకు డ్రస్ కోడ్స్ ఇచ్చేవాళ్లు ముందు వాళ్ల ఆలోచనా ధోరణి మారాలి. కానీ ఈనాటి తరంలో ఉండే మగవారు.. చాలా లాజికల్ గా, చాలా ధైర్యంగా, పద్దతిగా ఉంటారని చెప్పింది అనసూయ. తాను చెప్పింది రైటే అని నిరూపించండని కూడా నెటిజన్లను కోరింది అనసూయ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com