Anasuya Bharadwaj : ఆంటీ ట్రోల్స్ పై అనసూయ తగ్గేదేలే..

Anasuya Bharadwaj : నటి అనసూయ భరద్వాజ్ ట్విట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. అనసూయ ఆంటీ అని కొందరు కామెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వడంతో అనసూయ మండిపడింది. ఆంటీ అని నన్ను ట్రోల్ చేస్తున్న వారిపై పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ చేస్తానని హెచ్చరించింది. 25 ఏళ్లు వచ్చి పిల్లలు ఉంటే ఆంటీ అని ఎలా పిలుస్తారు. అదే మగవాళ్లకు వర్తిస్తుందా మీరు అలాగే పిలుస్తున్నారా అని అనసూయ ప్రశ్నించింది.
కొందరు రకరకాల మీమ్స్‌తో కూడా అనసూయను ట్రోల్స్ చేస్తున్నారు. లైగర్ ట్రోలింగ్‌ను తప్పించినందుకు థాంక్స్ ఆంటీ అని కొందరు మీమ్ చేస్తున్నారు. ఇంకొందరు.. ఎవరైనా హత్య చేస్తే కేసు పెడతారు.. ఆస్తి తగాదాలతో కేసు పెడతారు. ఈవిడేంట్రా ఆంటీ అంటే కేసు పెడుతుంది అని ట్రోల్ చేస్తున్నారు. దీనికి అనసూత తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. మిమ్మల్ని ఎవరైనా అంకుల్ అంటే కమ్ఫర్టబుల్‌గా ఉంటుందా.. లేకపోతే అలా పిలవొద్దు అనడం మీ హక్కు అని సమాధానం చెప్పింది అనసూయ.
దాదాపు అన్ని కామెంట్లకు ట్వీట్లకు అనసూయ రిప్లై ఇస్తోంది. ఈ రోజు తనకు చాలా సమయం ఉందని కాబట్టి రిప్లై ఇస్తున్నట్లు చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com