ఘాటుగా ట్వీట్ ఇచ్చిన అనసూయ.. దెబ్బకు డిలీట్ చేసిన నెటిజన్

ఘాటుగా ట్వీట్ ఇచ్చిన అనసూయ.. దెబ్బకు డిలీట్ చేసిన నెటిజన్
అనసూయతో పెట్టుకుంటే అట్లుంటది మరి. మన ఇంట్లో ఎలా ఉంటున్నామో మనకు తెలియదు కానీ ఇంకొకరికి ఉచిత సలహాలు ఇవ్వడానికి మాత్రం బాగా రెడీ అయిపోతుంటాం.

అనసూయతో పెట్టుకుంటే అట్లుంటది మరి. మన ఇంట్లో ఎలా ఉంటున్నామో మనకు తెలియదు కానీ ఇంకొకరికి ఉచిత సలహాలు ఇవ్వడానికి మాత్రం బాగా రెడీ అయిపోతుంటాం.. అదే విషయాన్ని అనసూయ ప్రశ్నించే సరికి దెబ్బకి తాను పెట్టిన పోస్టును డిలీట్ చేసాడు ఓ నెటిజన్.. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహిళలు ఉద్యోగాలు చేస్తుంటే కొందరు పురుషులు సహించలేకపోతున్నారు, కానీ తన భర్త నిక్ తనకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారని చెప్పారు. ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన అనసూయ.. ఇంట్లో ఒక టీమ్‌గా ఉంటూ, ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకుంటే ఇది సాధ్యమవుతుంది అని అన్నారు. కానీ చాలా కుటుంబాల్లో ఇలాంటి వాతావరణం ఉండదు.. ఒకవేళ ఎవరైనా అలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ జీవిస్తుంటే వాళ్లపై ట్రోల్స్ చేస్తుంటారు. అందరూ కలిసి కట్టుగా పనిచేస్తేనే ప్రపంచం అభివృద్ధి చెందుతుంది. అది కుటుంబం నుంచే మొదలు కావాలి.. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు కూడా అర్థమయ్యేలా చెప్పాలి అని అనసూయ రాసుకొచ్చారు.

ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవడంతో దానికి ఓ నెటిజన్ స్పందిస్తూ.. కుటుంబాన్ని పోషించే తన భార్యకు ఎలా వండిపెట్టాలో ఇప్పటి నుంచే మీ పిల్లలకు నేర్పించండి.. వచ్చే భార్య సంపాదిస్తుంది కాబట్టి అని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశాడు.. ఆ ట్వీట్ చూసి అనసూయకు చిర్రెత్తుకొచ్చింది.. అయినా కానీ తమాయించుకుని అతడికి చెప్పవలసిన సమాధానం సూటిగా చెప్పింది.. తప్పకుండా నేర్పిస్తా.. 11 ఏళ్ల మా అబ్బాయి నాకు కిచెన్‌లో సాయం చేస్తుంటాడు. అయినా అతడికి కాబోయే భార్య ఎలా జీవించాలి అనేది మీరు, నేను నిర్ణయించేది కాదు.. ఎందుకంటే వాళ్ల జీవితం వాళ్ల చేతుల్లో ఉంటుంది. అందరి జీవితాల్లో జోక్యం చేసుకోవడం, మన జీవితం మీద ఫోకస్ చేయకపోవడం.. ఇదే కదా అసలు సమస్య. అందుకే మీ పని మీరు చూసుకోండి అని అనేసరికి బాబుకి బాగా తగిలినట్టుంది.. దెబ్బకి తాను చేసిన ట్వీట్‌ను డిలీట్ చేశాడు.

Tags

Next Story