Anasuya Bharadwaj: రవితేజ దగ్గర ఆ సీక్రెట్ తెలుసుకునేంత వరకు వదలను: అనసూయ

Anasuya Bharadwaj: మరికొన్ని రోజుల్లో టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ ఫైట్‌ను చూడబోతున్నారు ప్రేక్షకులు. ఈ ఫైట్‌ను ముందుగా రవితేజ నటించిన 'ఖిలాడి' చిత్రం ప్రారంభించనుంది. ఫిబ్రవరి 11న ఖిలాడి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఖిలాడి సినిమాపై మూవీ టీమ్ అంతా చాలా నమ్మకంగా ఉంది. సినిమా పక్కా హిట్ అవుతుందని మేకర్స్ అనుకుంటున్నారు. పైగా ఇప్పటికే విడుదలయిన ఖిలాడి ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో అనసూయ.. చంద్రకళ అనే ఓ కామెడీ క్యారెక్టర్‌లో కనిపించింది. యాంకర్ నుండి నటిగా మారిన అనసూయ.. తాజాగా వరుస సినిమాలతో దూసుకుపోతోంది.
రవితేజ ఎనర్జీకి, తన వయసుకు అస్సలు సంబంధం లేనట్టుగా అనిపిస్తాడు. అందుకే ఇప్పటికీ మాస్ మహారాజ్ అనే టైటిల్ తన ఒక్కడికే సొంతమయ్యింది. అయితే రవితేజతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న అనసూయ.. ఆయన ఎనర్జీ వెనుక సీక్రెట్ ఏంటో కచ్చితంగా కనిపెడతానంటూ చెప్పింది. పైగా ఈ చిత్రంలో చంద్రకళ పాత్రలో నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com