Anasuya Bharadwaj: 'ఇలాంటి బట్టలు వేసుకుంటావా' అంటూ నెటిజన్ కామెంట్.. అనసూయ స్ట్రాంగ్ కౌంటర్..

Anasuya Bharadwaj (tv5news.in)
Anasuya Bharadwaj: తెలుగు యాంకర్లలో అనసూయ భరద్వాజ్‌కు ఉన్న పాపులారిటీనే వేరే లెవెల్. టాలీవుడ్‌లో బాగా బిజీ అయిపోయిన యాంకర్లలో అనసూయ కూడా ఒకరు. ఒకవైపు యాంకరింగ్, మరోవైపు యాక్టింగ్ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ.. అనసూయ ఫుల్ బిజీగా సమయాన్ని గడిపేస్తోంది. ఇదే టైమ్‌లో అనసూయ తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్‌కు కూడా స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఓ నెటిజన్ అన్న మాటకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అనసూయ.
నెగిటివ్ కామెంట్స్‌ను తిప్పికొట్టడంలో అనసూయ తనకు తానే సాటి. సోషల్ మీడియాలో ఎవరైనా తనపై నెగిటివ్ కామెంట్ చేసినా.. తనకు నచ్చని విషయం మాట్లాడిన అనసూయ వెంటనే రియాక్ట్ అయ్యి వారికి సమాధానం చెప్తోంది. అలా ఎన్నోసార్లు ఎన్నో కాంట్రవర్సీల్లో కూడా చిక్కుకుంది ఈ స్టార్ యాంకర్. తాజాగా మరో నెటిజన్‌కు అనసూయ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ వైరల్‌గా మారింది.
జబర్దస్త్ అనే స్టాండప్ కామెడీ షోతోనే అనసూయ విపరీతంగా పాపులర్ అయ్యింది. కాకపోతే ఆ షోలో అనసూయ వేసే దుస్తులపై ఇప్పటికీ నెటిజన్లు ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటారు. తాజాగా 'అనసూయ మీరు ఇద్దరు పిల్లల తల్లి అయ్యిండి ఇలాంటి బట్టలు వేసుకుంటావా.. తెలుగు ఆడపడుచు పరువు తీస్తున్నావు' అంటూ కామెంట్ చేశాడు. దీనికి అనసూయ దిమ్మదిరిగే రిప్లై ఇచ్చింది.
'దయచేసి మీరు మీ పనిని చూసుకోండి నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు' అని ఆ నెటిజన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది అనసూయ. ప్రస్తుతం తను చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దయచేసి మీరు మీ పనిని చూసుకోండి నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు 🙏🏻🙂 https://t.co/Uy4P00bmAE
— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 4, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com